చిన్న రౌడీగారు.. సెకండ్ సినిమా సంగతేంది?

0

యువహీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ‘దొరసాని’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ సినిమా ఫలితంతో నిరాశపడకుండా జూనియర్ దేవరకొండ తదుపరి చిత్రాలను లైన్లో పెట్టాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఒక్క సినిమా గురించి కూడా అధికారికంగా అప్డేట్లు రావడం లేదు.

‘దొరసాని’ తర్వాత భవ్య క్రియేషన్స్ బ్యానర్లో నూతన దర్శకుడు వినోద్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడని అన్నారు. ఆ సినిమా విశేషాలు ఇంతవరకూ ఏవీ బయటకు రాలేదు. అసలు షూటింగ్ జరుగుతోందా లేదా అనే సంగతి ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే ఆనంద్ మరో షార్ట్ ఫిలిం డైరెక్టర్ దామోదర దర్శకత్వంలో ఒక కామెడీ థ్రిల్లర్ చేస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా షూటింగ్ గురించి కూడా పెద్దగా వివరాలు బయటకు రాలేదు. ఇదిలా ఉంటే ఓ వారం క్రితం 1990 ల సినిమా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాళి’ సినిమాకు రీమేక్ చేయబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. దీని మీద కూడా ఏం క్లారిటీ లేదు.

ఇక ఆనంద్ వైపు నుండి తన సెకండ్ ఫిలిం కు సంబంధించి ఏదైనా ఇన్ఫో అభిమానులతో.. నెటిజన్లతో షేర్ చేసుకున్నాడంటే.. నవంబర్ 4 వ తేదీన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెనాలి దగ్గర సెకండ్ ఫిలిం షూటింగ్ జరుగుతోందంటూ ఒక పొలం ఫోటోను షేర్ చేశాడు. అంతే కానీ ఆ సెకండ్ ఫిలిం ఏంటో మాత్రం వివరాలు చెప్పలేదు. ఆనంద్ సెకండ్ సినిమా షూటింగ్ అయితే జరుగుతోంది కానీ ఆ సినిమా వివరాలు తెలియాలంటే చిన్న రౌడీగారు స్వయంగా వెల్లడించాల్సిందే. అప్పటివరకూ మనం వేచి చూడకతప్పదు.
Please Read Disclaimer