బన్నీ గొప్పవాడు అయ్యాడా..మహేష్ మొనగాడు అయ్యాడా?

0

సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ల తకరారు ఒక కొలిక్కి వచ్చింది. గత వారం రోజులుగా జరిగిన హంగామాకు తెరపడింది. షెడ్యూల్ ప్రకారమే ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11 న.. ‘అల వైకుంఠపురములో’ 12 న విడుదల కానున్నాయి. మరి ఈ విషయంలో పరిష్కారం లభించడంలో తెరవెనుక ఏం జరిగింది? డేట్ మార్చకుండా వెనక్కు తగ్గి బన్నీ గొప్పవాడు అయ్యాడా? తన మాటమీదే ఉంది మహేష్ మొనగాడు అయ్యాడా?

ఈ సమస్య పరిష్కారం కోసం ప్రొడ్యూసర్స్ గిల్డ్ వారు ప్రయత్నం చేశారని.. వారి వల్లే ఈ రిలీజ్ డేట్ల దోబూచులాటకు శుభం కార్డు పడిందని సమాచారం. ముందుగా అనుకున్న థియేటర్ల ఒప్పందం ప్రకారమే రెండు సినిమాలకు థియేటర్లు లభించేలా సర్దుబాటు జరిగిందట. 11 న మొదటి మహేష్ సినిమాకు మూడు థియేటర్లు ఇచ్చారు అనుకోండి.. తర్వాత వచ్చే బన్నీ సినిమా రెండు రోజులు రెండు థియేటర్లలో ప్రదర్శిస్తారు. అంటే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి ఓపెనింగ్ డే ఎడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా రెండు సినిమాలకు థియేటర్లు సమానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మొదటి వారంతం తర్వాత 50-50 షేరింగ్ లో ఈ సినిమాలకు థియేటర్లు కేటాయిస్తారు.

నిజానికి ఇది ముందు అనుకున్న జెంటిల్మేన్ అగ్రిమెంటే. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసి అనధికారికంగా ఎక్కువ థియేటర్లకోసం ప్రయత్నం చేయడం.. 12 వ తేదీ కూడా ఎక్కువ థియేటర్లు ఉంచుకుంటున్నారని సమాచారం రావడంతో బన్నీ టీమ్ కు కోపం వచ్చి తమ సినిమాను ప్రీ పోన్ చేస్తామని అన్నారు. దీంతో మొదటికే మోసం వస్తుందని గ్రహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ఇప్పుడు కాంప్రమైజ్ కు వచ్చారని అంటున్నారు. ఈ విషయలో అనధికారికంగా థియేటర్లు బ్లాక్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్ రాజు అండ్ కో ఇప్పుడు థియేటర్ల విషయంలో ‘అల వైకుంఠపురములో’ టీమ్ కు ఇబ్బంది రాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారం అయిందని అన్తున్నారు.

ఇదిలా ఉంటే అసలు దిల్ రాజు అండ్ కో మహేష్ కోసం అనధికారికంగా థియేటర్లు బ్లాక్ చేశారా లేదా అనే విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది చూపించి ఆవేశంగా 10 వ తేదీన తమ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించడం.. ఇప్పుడు మళ్లీ కాంప్రమైజ్ కు రావడంతో బన్నీ టీమ్ తొందరపాటు అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పోటీలన్నీ సరే కానీ అసలు సిసలు బాక్స్ ఆఫీస్ పోటీలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో వేచి చూడాలి.




Please Read Disclaimer