రిలీజ్ ముందు రోజు డార్లింగ్ ఏం చేస్తాడు?

0

`సాహో` రిలీజ్ కి ఒక రోజు ముందు డార్లింగ్ ప్రభాస్ ఏం చేస్తాడు? అంటే అందుకు ప్రభాస్ నుంచి వచ్చిన సమాధానం ఆసక్తికరం. ముందు రోజు దుప్పటి కప్పుకుని హాయిగా ఎలాంటి ఒత్తిడి లేకుండా పడుకుంటానని అంతా భావిస్తున్నారు. నిద్ర పోవాలని ప్రయత్నిస్తాను నిజమే. అయితే టెన్షన్ తో నిద్ర పట్టదు. నా ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఇదే సన్నివేశం ఉంటుందని ప్రభాస్ వెల్లడించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో `నాచ్ బలియే` సీజన్ 9 సహా కపిల్ శర్మ షోల్లో ప్రభాస్ – శ్రద్ధా కపూర్ జోడీ సందడి చేశారు.

నాచ్ బలియే షోలో సీనియర్ కథానాయిక రవీనాటాండన్ తో కలిసి డార్లింగ్ ప్రభాస్ `టిప్ టిప్ బర్సా పానీ` పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. కపిల్ శర్మ షోలోనూ ప్రభాస్ సందడి మామూలుగా లేదు. రిలీజ్ కి ఒక రోజు ముందు ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు డార్లింగ్ ప్రభాస్ పైవిధంగా స్పందించారు. ఒకరోజు ముందు శ్రద్ధాకు అయితే ఏమవుతుంది? అంటే.. ఆ రోజంతా అజీర్ణ సమస్యతో బాధపడుతుందని ఓ రూమర్ ఉంది అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. ఈ సీన్ చూసిన వారంతా కేవలం పెద్ద తెరపైనే కాదు.. టీవీ షోల్లోనూ శ్రద్ధాతో ప్రభాస్ కెమిస్ట్రీ అదిరిపోతోందన్న ప్రచారం సాగుతోంది.

వందల కోట్ల బడ్జెట్లతో సినిమాలు తీసి రిలీజ్ చేస్తుంటే ఒకరోజు ముందు నిద్ర పడుతుందా ఎవరికైనా? డార్లింగ్ ప్రభాస్ అందుకు అతీతుడేం కాదు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన `సాహో` ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజవుతోంది. తనని నమ్మి పెట్టుబడులు పెట్టిన స్నేహితుల కోసం ప్రభాస్ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. అంతకుమించి ఎన్నో సాహసాలు చేశారు. ఆ కష్టం ఫలించి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటామని ప్రభాస్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer