సూపర్ స్టార్ మేనల్లుడి సినిమా ఏమైంది?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న సినిమా మొదట దిల్ రాజు నిర్మాణంలో లాంచ్ అయింది. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో గల్లా అశోక్ హీరోగా మరో డెబ్యూ సినిమాను ప్రారంభించారు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను గల్లా ఫ్యామిలీ నిర్మిస్తోంది.

ఈ సినిమాను పోయినేడాది నవంబర్ రెండో వారంలో లాంచ్ చేశారు. లాంచ్ సమయంలో హడావుడి జరిగింది కానీ తర్వాత ఇప్పటి వరకూ ఆ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేదు. అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతోందా లేదా ఆగిపోయిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉంది కానీ గల్లా అశోక్ సినిమా గురించి ఏమీ మాట్లాడడం లేదు. గల్లా అశోక్ సినిమా లాంచ్ కార్యక్రమం లైవ్ ఇచ్చి మరీ సినిమాకు ప్రచారం కల్పించారు కానీ తర్వాత అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఏం జరుగుతోందనేది అర్థం కావడం లేదు.

ఎకే ఎంటర్టైన్మెంట్స్ తో మహేష్ బాబు సినిమా చేయడంతో ఆ బ్యాడ్ లక్ మహేష్ బాబుకే కాదు ఫ్యామిలీ మెంబర్లకు కూడా అంటుకుందని కొందరు ఫిలిం నగర్లో కామెంట్లు చేస్తున్నారు. పైకి చూస్తే ఇదేదో మొకాలికి బోడిగుండుకు లంకె పెట్టినట్టు అనిపిస్తుంది కదా? ఈ సినిమాకు ఎకే ఎంటర్టైన్మెంట్స్ వారికి అసలు సంబంధమే లేదు. మరి దానికి దీనికి లింక్ ఎందుకు పెడుతున్నారబ్బా?
Please Read Disclaimer