కళ్యాణ్ దేవ్ సినిమా.. ఏంటి సంగతి?

0

మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కొత్త హీరోలు వస్తూనే ఉంటారు. ప్రేక్షకులు కూడా నచ్చిన వారిని ఆదరిస్తూనే ఉంటారు. వ్యతిరేకులు మెగా క్రికెట్ టీమ్ అని సెటైర్లు వేసినా మెగా హీరోలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే అందరూ మెగా హీరోలు అలా ఎంట్రీ ఇచ్చి రెండు మూడు సినిమాలు చేసి ఇలా సక్సెస్ సాధించి స్టార్ హీరోలు కాలేరు. కొందరికీ ఆ అదృష్టం దక్కింది. ప్రస్తుతం మరికొందరు ఆ ప్రయత్నాలలో ఉన్నారు. మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలలో ఉన్నాడు.

కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని రెండో సినిమాను పట్టాలెక్కించారు. దసరా సీజన్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ‘సూపర్ మచ్చి’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు పులి వాసు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే అప్పటి నుంచి ఈ సినిమా గురించి పెద్దగా అప్డేట్లు లేవు. ఈ సినిమాలో మొదట రియా చక్రవర్తిని హీరోయిన్ గా తీసుకున్నారు కానీ లాస్ట్ మినిట్ లో రియాను తప్పించారని చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి.

తర్వాత రియా స్థానంలో కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్ ను తీసుకున్నారట. కన్నడలో కూడా సినిమాను రిలీజ్ చేసే ఆలోచనతోనే ఇలా రచితను ఎంచుకున్నారట. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి? షూటింగ్ జరుగుతోందా.. అంటే ప్రస్తుతం షూటింగ్ ఆగిందని సమాచారం. కళ్యాణ్ దేవ్ – రచిత రామ్ మధ్య కెమిస్ట్రీ సరిగా వర్క్ అవుట్ కావడం లేదట.. అందుకే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer