ఆ సినిమా ఏమైంది రాజు గారు ?

0

టాలీవుడ్ లో ఇప్పటికే కొందరు సినీ వారసులతో రాజకీయనాయకుల వారసులు కూడా అడుగు పెడుతున్నారు. ఇటివలే గల్లా జయదేవ్ తనయుడు కూడా ఎంట్రీ సెట్ చేసుకున్నాడు. ఇలా అందరూ డెబ్యూ సినిమా సెట్ చేసుకుంటుంటే దిల్ రాజు తమ్ముడు శిరీష్ తనయుడు సినిమా మాత్రం ఇంకా డిస్కర్షన్ స్టేజిలోనే ఉంది.

ఆ మధ్య సతీష్ అనే దర్శకుడితో అశీష్ సినిమా ప్లాన్ చేసారు. దానికి ‘పలుకే బంగారమాయెనా’ టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ విషయాన్నీ ఆ మధ్య స్వయంగా రాజు గారే ఓ సందర్భంలో చెప్పారు. అయితే ఎందుకో ఆ సినిమా సినిమా అనౌన్స్ మెంట్ స్టేజిలో ఆగిపోయింది.

ఆ సినిమా క్యాన్సల్ అయిందని అశీష్ డెబ్యూ మరో దర్శకుడితో ఉండబోతుందనే వార్త బయటికొచ్చింది. ఇక లవర్ తో హర్షిత్ ని నిర్మాతగా నిలబెట్టలేకపోయిన దిల్ రాజు ఈసారి ఆశీష్ హీరోగా చేస్తున్న విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. అందుకే ఈ హీరో డెబ్యూ సినిమా ఇంకా ఆలస్యం అయ్యే చాన్స్ ఉందని టాక్. మరి రాజు గారి వారసుడు ఎంట్రీ ఎప్పుడో ఆయనకే తెలియాలి.
Please Read Disclaimer