ఆ డైరెక్టర్ ‘ఎన్టీఆర్’ని కాదని మరో హీరోని ఓకే చేశాడా..?

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయనున్నాడు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే కొత్త సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుందని ఇదివరకే ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాకి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మించాలని సిద్ధంగా ఉన్నారు. అందుకోసం ఎన్టీఆర్ కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీ చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. నిజానికి ఈ ప్రాజెక్ట్ పై పరస్పర ఒప్పందాలు జరిగినట్లు సమాచారం.

అయితే తమిళ డబ్బింగ్ ‘రాజారాణి’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి డైరెక్టరుగా పరిచయమయ్యాడు అట్లీ. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ యంగ్ డైరెక్టర్ ఇళయదళపతి విజయ్ హీరోగా ‘పోలీసోడు’.. ‘అదిరింది’.. ‘విజిల్’ సినిమాలను తెరకెక్కించి మంచి స్టార్డం సొంతం చేసుకున్నాడు. అయితే విజిల్ సినిమా గతేడాది దసరాకి విడుదల కాగా.. ఇంతవరకు అట్లీ కొత్త సినిమా గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ మధ్య ఎన్టీఆర్ తో ఓ ద్విభాషా సినిమా తీస్తానని అన్నాడు. కానీ ఇంతవరకు మళ్లీ దాని గురించి స్పందించలేదు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో అట్లీ.. తమిళ హీరో జయం రవితో సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. వీరిద్దరూ ఇదివరకే పలుమార్లు కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ చేసినట్లు సమాచారం. మరి ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..!
Please Read Disclaimer