96 ఊసే లేదేమిటి శర్వా ?

0

యంగ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ గడిచిన మూడేళ్లలో ఫుల్ జోష్ చూపించాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసాడు. హిట్లు.. ప్లాప్ లను చూస్తే సరిసమంగా ఉండటంతో బ్యాలెన్స్ చేయగలిగాడు కానీ ఈ ఆట ఇంకెన్నాళ్లు! అన్న చర్చ ఇటీవల మొదలైంది. ప్రస్తుతం టాలీవుడ్ లో బాక్సాఫీస్ గణాంకాలు అనూహ్యంగా మారాయి. బ్యాలెన్స్ చేసేస్తే సరిపోదు. వరుస హిట్లతో ప్రతిదీ తొలి సినిమానే అన్నంత కసిగా పని చేయాల్సిందే. తీవ్రమైన పోటీని తట్టుకుని నిలవాలంటే సెంటిమెంటు పరిశ్రమలో హిట్టొక్కటే దారి చూపిస్తుంది. కానీ శర్వానంద్ ఆ విషయంలో వెనుకబడే ఉన్నాడు. పడి పడి లేచే మనసు- రణరంగం చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై నిరాశపరిచాయి. బ్యాక్ టు బ్యాక్ వైఫల్యాలు ఇబ్బంది పెట్టాయి. కాన్ఫిడెంట్ గా చేసాం.. కానీ ఎక్కడో మిస్ పైర్ అయ్యామని శర్వా స్వయంగా అంగీకరించాడు.

ప్రస్తుతం 96 రీమేక్ లో నటిస్తున్నాడు. సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై రాజుగారితో పాటు శర్వా చాలా ఆశలు పెట్టుకున్నారు. నిర్మాత ఎంతో ఇష్టపడి ఎంచుకున్న కథ పైగా.. ఆయన జడ్జిమెంట్ పై నమ్మకంతో శర్వా వెంటనే ఓకే చేశాడు. ఈ నేపథ్యంలో 96 పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. ఆ విషయాన్ని పక్కన బెడితే శర్వా తదుపరి కమిట్ మెంట్ల విషయంలో ఎందుకని జోరు తగ్గించాడో అర్థం కావడం లేదు. ఒక సినిమా సెట్స్ లో ఉంగానే మరో సినిమాకు కాల్షీట్లు కేటాయించే శర్వా ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేనట్లే కనిపిస్తోంది.

ప్రస్తుతానికి 96 తప్ప కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించలేదు ఎందుకనో. శ్రీకారం.. కీరవాణి అనే రెండు స్క్రిప్టులు విన్నట్లు ప్రచారంలో ఉంది కానీ.. అవి ఒకే చేసినట్టేనా కాదా అన్నది తెలియలేదు. ఇవన్నీ ఓకే చేసి ఠెంకాయ కొడితేనే ఖాయమైనట్టు. అయితే ఇప్పటివరకూ ఒప్పుకున్న కథల్ని తిరిగి బెటర్ మెంట్ చేయాలని దర్శకరచయితలకు చెప్పాడట. ఫ్లాపుల నేపథ్యంలో ఈసారి కథల విషయంలో కేరింగ్ ఎక్కువైనట్లే కనిపిస్తోంది. ఒకటికి రెండు సార్లు స్క్రిప్టుని క్రాస్ చెక్ చేసుకోమని.. అవి వర్కౌట్ అవుతాయా లేదా? అన్నది రివ్యూలు చేస్తున్నాడట. ఇదే కాదు.. రిలీజ్ కి రావాల్సిన 96 కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా సరిగా కనిపించడం లేదు. మరి దానిపైనా శర్వా శ్రద్ధ పెడతాడేమో చూడాలి.
Please Read Disclaimer