మెగాస్టార్ భుజానికి శస్త్ర చికిత్స.. అసలేమైంది?

0

మెగాస్టార్ చిరంజీవి భుజానికి శస్త్ర చికిత్స జరిగిందా? భుజానికి ఏమైంది? చిరుకి అంత కష్టం ఏం వచ్చింది? ఏమో.. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం అయితే లేదు కానీ.. శస్త్ర చికిత్స జరిగింది అన్న మాట ఆయన నోటి నుంచే వినిపించింది. భుజానికి చికిత్స జరిగింది కదా అని.. చిరంజీవిని అస్సలు దర్శకనిర్మాతలు రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి వదిలిపెట్టలేదట. ఈ సీన్ చేయాల్సిందే అంటూ ఫైట్ సీన్లు చేయించారట. మెగాస్టార్ స్వయంగా ఓ హిందీ మీడియాకి వెల్లడించిన వివరాల ప్రకారం..

చిరు భుజానికి అత్యవసరంగా శస్త్ర చికిత్స జరిగింది. అయితే శస్త్ర చికిత్స జరిగాక కూడా అతడు దానికి ఏమాత్రం భయపడకుండా వెంటనే అది మానకుండానే షూటింగుల్లో పాల్గొన్నారు. గుర్రపు స్వారీలు చేశారు. కత్తి పట్టి శత్రువుతో యుద్ధం చేశారు. ఓవైపు గాయం బాధపెడుతున్నా ఆయన దేనినీ ఖాతరు చేయక `సైరా-నరసింహా రెడ్డి` కోసం అహోరాత్రులు ఎంతో తీవ్రంగానే శ్రమించారు.

చిరు మాట్లాడుతూ-“నా భుజానికి శస్త్ర చికిత్స జరిగింది.. అయినా చరణ్- సురేందర్ రెడ్డి నన్ను వదల్లేదు. అసలు వాళ్లు ఏ విషయంలోనూ రాజీకి రాలేదు. నాతోనే ఫైట్ సీక్వెన్సులు చేయించారు. గుర్రపు స్వారీ చేయాల్సొచ్చింది“ అని తెలిపారు. “నిజానికి ఆ సందర్భంలో ఎవరైనా డూప్ ని ఉపయోగించవచ్చు. ఫేస్ కి మార్ఫింగ్ చేసి మ్యానేజ్ చేసేయొచ్చు. కానీ అలా చేయలేదు“ అని చిరు తెలిపారు. అయితే అలాంటి కష్టాన్ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసేశాను… అని చిరు ఎన్నో షాకింగ్ మ్యాటర్స్ ని చెప్పారు. ఆ కష్టం ఫలించి `సైరా` మంచి విజయాన్ని అందుకుంటుందని.. ప్రేక్షకుల కళ్లలో ఆనందం చూడాలని ఉందని చిరు అన్నారు.
Please Read Disclaimer