జనవరి 20న ఆ ముగ్గరు హీరోలకు అంత స్పెషలేంటి?

0

ఓవైపు సంక్రాంతి బరిలోకి దిగే క్రమం లో మొదటి సినిమా వచ్చేసిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ స్టార్ రజనీ నటించిన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. అంతిమం గా ఈ కొత్త ఏడాదికి గుడ్ స్టార్ట్ గా పలువురు అభివర్ణిస్తున్నారు. రజనీ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్లో ఉంటాయి.. అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలోనే ఈ సినిమా కు లభించాయి. రేపు (శని).. ఎల్లుండి(ఆది) రెండు రోజుల్లో వరుసగా సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురము లో చిత్రాలు విడుదల కానున్నాయి.

అభిమానులందరి చూపులు.. మాటలు ఇప్పుడా సినిమాల మీదనే. పండుగ హడావుడి ఎంతో.. అందులో ఏ మాత్రం తగ్గని రీతిలో సినిమాలు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇలాంటి వేళ.. మరో ఆసక్తికరమైన వార్త ఒకటి తెర మీదకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. డార్లింగ్ ప్రభాస్.. విక్టరీ వెంకటేశ్ లు ముగ్గురికి ఒకే రోజు మంచిది కావటమే కాదు.. ఈ ముగ్గురు ఒకే రోజు చేస్తున్న పని ఇప్పుడు కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.

జనవరి 20న వేర్వేరు లొకేషన్లలో ఈ ముగ్గురు అగ్రహీరోల చిత్రాలు ప్రారంభం కానున్నాయి. పవన్ కల్యాణ్ రీఎంట్రీకి వేదిక మారనున్న పింక్..సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న ‘జాన్’.. వెంకటేశ్ చేయనున్న అసురన్.. ఈ మూడు చిత్రాలు జనవరి 20న పట్టాల మీదకు ఎక్కటమే కాదు.. ఆ రోజు నుంచే షూటింగ్ లు ప్రారంభం కానున్నాయి.

పవన్.. ప్రభాస్ సినిమాలు హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంటే.. వెంకీ సినిమా మాత్రం అనంతపురం లో షురూ కానున్నట్లు చెబుతున్నారు. ఒకే రోజు ముగ్గురు పెద్ద హీరోల చిత్రాల షూటింగ్ ప్రారంభం కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పింక్ మూవీ కోసం పవన్ లాయర్ అవతారంలో షూటింగ్ లో అడుగు పెట్టబోతుంటే.. జాన్ చిత్రం కోసం డార్లింగ్ యూరప్ సెట్లోకి వెళ్లనున్నారు. ఏమైనా. ఒకే రోజు మూడు పెద్ద సినిమాల షూటింగ్ షురూ కావటం ఆసక్తికరంగా మారింది.
Please Read Disclaimer