`మమాంగం` .. కేరళ వీరుడి సత్తా ఎంత?

0

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన పాన్ ఇండియా చిత్రం `మమాంగం`. 16వ శతాబ్ధంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. కేరళలో పురాతన కళలు యుద్ధ నైపుణ్యానికి సంబంధించిన గొప్ప విషయాల్ని తెరపై ఆవిష్కరిస్తున్నారని తాజాగా రిలీజైన తెలుగు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. మలయాళం- తెలుగు సహా పలు భాషల్లో ఈ చిత్రం మమాంగం అనే టైటిల్ తోనే రిలీజవుతోంది.
మమాంగం అంటే ఉత్సవం. కేరళ పురాతన సంప్రదాయాన్ని ఎలివేట్ చేసే ఉత్సవం అని భావించవచ్చు.

ఇప్పటికే ఈ ట్రైలర్ మలయాళ వెర్షన్ సహా అన్ని భాషల ట్రైలర్లు నెటిజనుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు ట్రైలర్ అంతే ప్రశంసలు అందుకుంటోంది. మమ్ముట్టిని యుద్ధ వీరుడిగా పూర్తి కొత్తగా ఆవిష్కరించనున్న చిత్రమిది. తనకంటే ఎంతో యంగర్ స్టార్లు ఇందులో కనిపిస్తున్నా మమ్ముట్టి ఆహార్యం ఎంతో ఎక్స్ క్లూజివ్ గా అలరిస్తోంది. కళరియపట్టు అనే విద్య సహా పలు రకాల యుద్ధ విద్యల పరిచయం ట్రైలర్ లో ఆకట్టుకుంది. ఇక తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు మమ్ముట్టి. యాత్ర తర్వాత మళ్లీ ఆయన సొంత గొంతు వినే సౌలభ్యం తెలుగు ఆడియెన్ కి కలుగుతోంది.

ఇక పాన్ ఇండియా కేటగిరీలో రిలీజైన బాహుబలి సంచలనాలే వీటన్నిటికీ స్ఫూర్తి. ఇటీవల సాహో – సైరా లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాలు రిలీజయ్యాయి. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు భారీ హైప్ తో వచ్చి కొన్నిచోట్ల గొప్ప కలెక్షన్స్ సాధించి చాలా చోట్ల పంపిణీదారులకు నష్టాల్ని మిగిల్చాయి. అయితే మమ్ముట్టి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మమాంగం రిజల్ట్ ఎలా ఉండనుంది? అన్న క్యూరియాసిటీ నెలకొంది. ప్రస్తుతం హిస్టరీ బ్యాక్ డ్రాప్ తో బాలీవుడ్ లోనూ సినిమాలు తెరకెక్కుతున్నాయి. హిందీలో అజయ్ దేవ్గణ్ నటిస్తున్న తానాజీ.. అర్జున్ కపూర్ నటిస్తున్న పానిపట్ ఈ తరహానే .
Please Read Disclaimer