గౌతమ్ జీ ఏంటీ ఈ కాపీ పేస్ట్?

0

ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సాహసం శ్వాసగా సాగిపో చిత్రం తర్వాత చేసిన చిత్రం ‘తూటా’. ధనుష్ హీరోగా మేఘ ఆకాష్ హీరోయిన్గా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. తమిళం మరియు తెలుగులో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూసిన ప్రేక్షకలుకు సినిమా పెద్దగా కనెక్ట్ అవ్వలేదు అంటూ టాక్ నడుస్తోంది. ట్రైలర్ ఆకట్టుకోక పోవడంతో పాటు గత చిత్రాలను పోలి ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

గౌతమ్ మీనన్ అంటే గతంలో ఒక క్రేజ్ ఉండేది. స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు ఆయన దర్శకత్వంలో నటించాలని ఆరాటపడేవారు. అలాంటి ఇప్పుడు ఆయన దర్శకత్వం అంటేనే ఆలోచించే పరిస్థితి ఉంది. తూటా చిత్రం విడుదలైన తర్వాత ఆయన దర్శకత్వంకు దండం పెట్టి మరీ హీరోలు సైడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తూటా ట్రైలర్ తర్వాత గౌతమ్ మీనన్ పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. తన సినిమాలను తానే కాపీ చేసుకుంటున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.

తూటా చిత్రంలో ఎక్కువ భాగం సీన్స్ సాహసం శ్వాసగా సాగిపో నుండి కాపీ చేసినట్లుగా అనిపిస్తున్నాయని.. మరి కొన్ని సీన్స్ వెంకటేష్ హీరోగా నట ఇంచిన ‘ఘర్షణ’ సినిమాలోని సీన్స్ ను ఎత్తేసినట్లుగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ బయట సినిమాల నుండి కాకుండా తన సినిమాల నుండి తానే కాపీ పేస్ట్ చేశాడంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 29న రాబోతున్న తూటా ఏ స్థాయిలో పేళుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Please Read Disclaimer