80s స్టార్స్ తో చరణ్ ఏం చేస్తున్నాడు?

0

మెగాస్టార్ రీమోడల్ చేయించుకున్న కొత్త ఇంట్లో ఎయిటీస్ (80ల నాటి) తారాతోరణం కొలువు తీరిన సంగతి తెలిసిందే. పార్టీలో బ్లాక్ కలర్ స్పెషల్ డ్రెస్ కోడ్ తో దాదాపు 40 మంది తారలు సందడి చేశారు. ఇప్పటికే సెలబ్రేషన్ నుంచి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా తారల గ్రూప్ ఫోటో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.

ఈ ఫోటోలో ప్రత్యేకించి ఎనభైల నాటి అందగత్తెల డామినేషన్ కనిపించింది. ఇందులో జయప్రద-సుమలత-రాధిక- సుహాసిని- శోభన-రాధ-జయసుధ- అమల వంటి స్టార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక వీళ్లందరితో పాటుగా అలనాటి మేటి నాయిక.. ప్రస్తుత రాజకీయ నాయకురాలు ఖుష్బూ కూడా ఈ వేడుకలకు ఎటెండయ్యారు.

తాజాగా ఖుష్బూ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెల్ఫీ అంతర్జాలంలో రివీలైంది. అంటే ఈ పార్టీలో ఎనభైల నాటి స్టార్స్ అందరితో 2020 స్టార్ రామ్ చరణ్ కూడా సందడి చేశారన్నమాట. పార్టీని గ్రాండ్ సక్సెస్ చేయడం కోసం మెగాస్టార్ తో పాటుగా చరణ్ విందు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని అర్థమవుతోంది. అసలే డాడీ ఏర్పాటు చేసిన పార్టీ కావడంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నారు చిరుతనయుడు. ఈ పార్టీలో తన ఫేవరెట్ స్టార్ ఖుష్బూతో చరణ్ సెల్ఫీ కూడా దిగారు. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది. ఆర్.ఆర్.ఆర్ బిజీలో క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో ఉన్న రామ్ చరణ్ ఇలా తీరిక చేసుకుని మరీ పార్టీకి ఎటెండవ్వడం ఆసక్తికరం.




Please Read Disclaimer