బిగ్ బాస్ లో గెలిస్తే కలిసొచ్చేదెంత?

0

తెలుగు నాట బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికి మూడు సీజన్లు పూర్తయ్యాయి. ముగ్గురు విజేతల్ని ప్రకటించారు. బిగ్ బాస్ 1 విజేత శివబాలాజీ .. బిగ్ బాస్ 2 విజేత కౌశల్ మండా .. బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్.. వీళ్లలో శివ బాలాజీ అప్పటికే నటుడిగా ఫేమస్. కౌశల్ మోడల్ కం నటుడిగా సుపరిచితం. రాహుల్ సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ గా పాపులరయ్యాడు.

అయితే విన్నర్స్ కి బిగ్ బాస్ కలిసొస్తుందా? వెండి తెర కలల్ని నిజం చేసుకునేందుకు ఇది ఎంతవరకూ కలిసొస్తోంది? అంటే చెప్పలేని పరిస్థితి. శివ బాలాజీ యథావిధిగానే బిగ్ బాస్ 1 తర్వాత కూడా అవే క్యారెక్టర్లు చేసుకుంటూ తన పనిలో తాను ఉన్నాడు. హీరోగా ఏదైనా పెద్ద లెవల్లో ప్రమోషన్ వచ్చేస్తుంది అని అనుకుంటే అలాంటిదేమీ ఒరగలేదు. కౌశల్ ఆయన పనుల్లో ఆయన ఉన్నాడు. మహేష్ రాజకుమారుడు.. ప్రభాస్ మిస్టర్ పెర్ఫెక్ట్ లాంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసాడు కౌశల్. జీ సీరియల్ సూర్యవంశంలోనూ కనిపించాడు. కానీ ఏం ప్రయోజనం. బిగ్ బాస్ గెలిచాక పెద్ద స్టార్ అవుతాడనుకుంటే అలాంటి మిరాకిల్ ఏదీ జరగలేదు.

ప్రస్తుతం సింగర్ రాహుల్ కప్ గెలిచాడు. మరి అతడి జీవితంలో ఎలాంటి మిరాకిల్ జరగబోతోంది? అన్నది చూడాలి. ముందుగా గెలుచుకున్న రూ.50లక్షల ప్రైజ్ మనీతో అమ్మా నాన్నకు సొంతంగా ఒక ఇల్లు కొనిచ్చి అద్దె గది నుంచి విముక్తి ప్రసాదిస్తానని అన్నాడు. మరి రాహుల్ కి బిగ్ బాస్ విజేతగా ఇకపై క్రేజు మరింత పెరిగి ఆర్జనకు అది కలిసొస్తుందా? అతడిని టాలీవుడ్ అందలమెక్కిస్తుందా? అన్నది చూడాలి. అయితే ఎవరు ఎదిగినా ఎదగక పోయినా అభిమానుల గుండెల్లో అయితే నిలిచారు వీళ్లంతా. ఎక్కడికి వెళ్లినా సెలబ్రిటీ హోదాని ఆస్వాధించవచ్చు. ఫ్యాన్స్ .. సెల్ఫీలు.. ఫోటోలు అంటూ బోలెడంత గడబిడ ఉంటుంది. ఇప్పటివరకూ గెలిచిన వాళ్లకు స్టాటస్ పరంగా మరింతగా మెరుగుపరుచుకున్నదేం లేదు. మరి చూడాలి మునుముందు ఏం జరగబోతోందో?
Please Read Disclaimer