సూపర్ హిట్ డైరెక్టర్ హ్యాట్రిక్ ఎవరి తో ?

0

ఒక సినిమా హిట్టయితే చాలు డెబ్యూ డైరెక్టర్ అయినా పట్టించుకోకుండా రెండో అవకాశం ఇచ్చేస్తుంటారు హీరోలు. ఇక రెండో సినిమా కూడా హిట్టయితే ఇంక అ దర్శకుడికి వరుస ఆఫర్స్ రావడం పక్కా. ఇప్పుడు శివ నిర్వాణ విషయం లో అదే జరుగుతుంది. మొదటి సినిమా ‘నిన్ను కోరి’ తోనే హిట్ అందుకున్న శివ రెండో సినిమా ‘మజిలీ’తో కూడా మరో హిట్ స్కోర్ చేసాడు.

‘మజిలీ’ షూటింగ్ సమయం లోనే విజయ్ కి ఓ స్క్రిప్ట్ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్న శివ నాని కోసం కూడా మరో కథను సిద్దం చేసాడు. ఈ కాంబో సినిమా ను దిల్ రాజు నిర్మిస్తాడనే టాక్ నడుస్తుంది. ఈ ఇద్దరి తో సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి. కాకపోతే ఎవరితో ముందు చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం నాని కొత్త దర్శకుడి తోనే సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇక విజయ్ కూడా పూరి ‘ఫైటర్ ‘తో పాటు ‘హీరో’ సినిమా ను కూడా ఫినిష్ చేసే ఆలోచన లో ఉన్నాడు. మరి ఈ ఇద్దరి లో శివ మూడో సినిమా ఎవరి తో ఉంటుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
Please Read Disclaimer