వాట్సాప్ కలిపిన ఫ్యామిలీ బంధం

0

వాట్సాప్ తెచ్చిన విప్లవం అంతా ఇంతా కాదు. ఇది కేవలం యువ తరానికే కాదు పెద్ద వాళ్లకు ఎంతో అను కూలమైన సాధనంగా మారింది. ఇంట్లో మాట్లాడు కునే రెగ్యులర్ బాతాఖానీ నుంచి కంపెనీల్లో వృత్తిపరమైన విషయాల్ని ఇందులో డిస్కస్ చేసుకోవడం చూస్తున్నాం. ఇక కొన్ని ఉమ్మడి కుటుంబాల్లో అయితే ఫ్యామిలీ సభ్యులందరి కోసం గ్రూప్ లు క్రియేట్ చేసుకుని అందులో చాలా విషయాల్ని ప్రతిదీ లైవ్ గా ముచ్చటించుకుంటున్నారు. వాట్సాప్ గ్రూప్ లు ఇలా విడి పోయిన బంధాల్ని కలుపుతున్నాయి. దూరంగా ఉన్న బంధు మిత్రుల్ని ఓ చోటి కి చేరుస్తున్నాయనే చెప్పాలి.

బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ వృక్షం గురించి చెప్పాల్సిన పనేలేదు. బోనీ కపూర్- అనీల్ కపూర్ ఫ్యామిలీ ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటుంది. ఆ ఇరు కుటుంబాల్లో నలుగురైదుగురు సిస్టర్స్ ఒక బ్రదర్ తో పాటు కిడ్స్ కూడా ఉన్నారు. అయితే వీళ్లందరి ఫోన్ నంబర్ల తో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ బోనీ కపూర్ రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. ఆ సంగతి తాజా గా అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ వల్ల రివీలైంది. మామ్ శ్రీదేవి మరణం తర్వాత కపూర్ ఫ్యామిలీ మరింత దగ్గరైంది. ఒకే గొడుగు కింది కి వచ్చారంతా. అర్జున్ కపూర్- అన్షుల కపూర్ లతో పాటు గా జాన్వీకపూర్- ఖుషీ కపూర్ సిస్టర్స్ కూడా ఒకే చోట నివాసం ఉంటున్నారు. వీళ్లందరికీ ప్రత్యేకించి ఒక వాట్సాప్ గ్రూప్ రన్నింగ్ లో ఉంది. ఇందులో డాడ్ బోనీ తో నిరంతరం కూతుళ్లు ఏదో ఒకటి ముచ్చటిస్తూ నే ఉంటారు. అర్జున్ భయ్యా కూడా ఆ గ్రూప్ లో టచ్ లో ఉన్నాడు. అలాంటి ఫ్యామిలీ వాట్సాప్ చాట్ ని స్క్రీన్ షాట్ తీసి అన్షులా ఆ సీక్రెట్ ని కాస్తా ఓపెన్ చేయడం తో అది కాస్తా మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

అసలింతకీ ఇందులో ఏం మాట్లాడుకున్నారు వీళ్లంతా అని పరిశీలిస్తే.. ఒకేరోజు బోనీకపూర్ ఓచోటికి వెళితే.. జాన్వీ కపూర్ ఇంకొక చోటికి వృత్తి పరమైన పనుల్లో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ప్రయాణాలు ఎలా సాగాయి? సురక్షితం గా విమానం ల్యాండ్ అయ్యిందా లేదా? అంటూ వాట్సాప్ గ్రూప్ లో బాతాఖానీ సాగింది. ప్లైట్ ల్యాండ్ అయిన విషయాన్ని.. లాంజ్ లో వెయిటింగ్ విషయాల్ని కూడా ముచ్చటించుకున్నారు. బోనీ చెన్నయ్ నుంచి ముంబైకి ప్రయాణం.. జాన్వీ దిల్లీ నుంచి తిరుగు ప్రయాణం వగైరా వగైరా విషయాలు ఇందులో ముచ్చటించుకున్నారు. ఇక ఇటీవల భయ్యా అర్జున్ కపూర్ తో జాన్వీ అనుబంధం మరింతగా పెరిగింది. ప్రతిదీ భయ్యా తో ముచ్చటిస్తోంది. అన్నా చెల్లెళ్ల సరదా చాటింగ్ కూడా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా బయట పడింది. మొత్తాని కి వాట్సాప్ కలిపిన బంధం లో ఇన్ని సరిగమలు ఉంటాయా? అని ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.

అర్జున్ కపూర్ నటించిన హిస్టారికల్ వారియర్ చిత్రం `పానిపట్` త్వరలో రిలీజ్ కి వస్తోంది. అలాగే జాన్వీ కపూర్ ది కార్గిల్ గర్ల్- గుంజన్ సక్సేనా బయోపిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదేగాక వరుసగా పలు భారీ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నిర్మాత బోనీ ఇటు వైపు చెన్నయ్- హైదరాబాద్ కి రెగ్యులర్ గా వస్తూ సౌత్ లో సినిమాలు నిర్మించే పనుల్లో హడావుడిగా తిరిగేస్తున్నారు.
Please Read Disclaimer