వాటే బ్యూటీ సాంగ్: నితిన్ క్లాసీ స్టెప్స్.. రష్మిక గ్లామ్ షో బ్లో

0

నితిన్ – రష్మిక జంటగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న భీష్మ ప్రస్తుతం ట్రెండీ టాపిక్. ఫిబ్రవరిలో రిలీజవుతున్న ఈ సినిమాపై సినీవర్గాలు సహా నితిన్ అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటివరకూ రిలీజైన పోస్టర్లు సాంగ్స్ చూస్తే ఇదో క్లాసీ లవ్ స్టోరి అని అర్థమవుతోంది. పోస్టర్లకు టాక్ బావుంది. యూత్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి.

తాజాగా `వాటే బ్యూటీ .. ` తొలి సాంగ్ రిలీజైంది. అదిరిపోయే మాస్ సాంగ్ ఇది. నితిన్ పర్ఫెక్ట్ క్లాసీ స్టెప్స్ తో మైమరిపిస్తే.. రష్మిక అందచందాల ఎలివేషన్ స్టెప్స్ అంతే ఇంప్రెస్సివ్ అని చెప్పాలి. ఇక కాస్ట్యూమ్స్ అల్ట్రా రిచ్ లుక్ తో మైమరిపించాయి. అలాగే రష్మిక అందచందాల ఎలివేషన్ పీక్స్ అనే చెప్పాలి. నితిన్ టీమ్ రష్మికలో ఎనర్జీని.. అందాల ఆరబోతతో ట్రీట్ ని తెలివిగా ఈ సినిమాకి ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు.. తాజా సాంగ్ లో రష్మిక అందాల ఆరబోత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మహతి స్వర సాగర్ మాస్ బీట్ ఎనర్జిటిక్ గా అలరించింది. ఇక ఈ పాటకు ఎంపిక చేసుకున్న ఆర్ట్ వర్క్ ఇంప్రెస్సివ్.. బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతే ఆకట్టుకుంది. వాటే బ్యూటీ.. ప్రస్తుతం యూత్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. పోస్టర్లు.. పాటల ప్రచారంతో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఆ స్థాయిలో థియేటర్లలో భీష్మ మెప్పిస్తాడా? అన్నది చూడాలి.
Please Read Disclaimer