యువ హీరో సినిమా రిలీజ్ సంగతి తేలడం లేదే!

0

ఆయన ఒక యువ టాలీవుడ్ హీరో. నటన తో.. భిన్నమైన యాటిట్యూడ్ తో ఒక్క సారిగా యూత్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. అయితే ఎంత క్రేజ్ వచ్చినా.. ఎంతమంది ఆయనను స్టార్ అని పిలిచినా జయాప జయాలను తప్పించు కోలేరు కదా. అలానే ఈమధ్య ఫ్లాపులు తగలడం తో కాస్త జోరు తగ్గింది. ఆ ప్రభావం ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమా పై పడిందని సమాచారం.

నిజానికి ఈ సినిమాను స్టార్డమ్ రాక ముందు ఒప్పుకోవడం తో తప్పని సరై చేస్తున్నాడట. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ గా నిర్మాత నుంచి హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ దగ్గర ఒక ఇంటిని పుచ్చుకున్నాడట ఈ హీరో. సినిమా విషయం లో అంతా నేను చూసుకుంటానని.. విజయం తథ్యమని హామీ ఇచ్చాడట. అయితే ఇప్పుడు చూస్తే ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో.. ఏంటో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సినిమా కు సంబంధించి పెద్దగా అప్డేట్స్ కూడా రావడం లేదు. దీంతో సినిమా విషయం లో ఏం జరుగుతుందో బయటకు తెలియని పరిస్థితి నెలకొంది.

మరి ఈ సినిమా విషయం లో హీరో ఏం చేస్తాడో.. ఎప్పుడు ఈ సినిమా ను పూర్తి చేసి విడుదలకు సహకరిస్తాడో తెలియడం లేదట. అయితే ఇప్పటికీ హీరోగారికి మంచి క్రేజ్ ఉంది కాబట్టి సినిమా ప్రమోషన్స్ గట్టిగా చేస్తే మంచి బిజినెస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే నిర్మాత కూడా కాస్త ధైర్యం గానే ఉన్నాడట. మరి ఈ సినిమా విషయం లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Please Read Disclaimer