సర్జరీ చేయించుకో.. పేరు మార్చుకో అన్నారు!!

0

బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలంటే అంత సులువేమీ కాదు. దానికి చాలా సమయం పడుతుంది. ఒకసారి సక్సెస్ దక్కాక వరుసగా ఆఫర్ల వెల్లువ ఆ రేంజులోనే ఉంటుంది. పారితోషికం పెద్దగానే ఖాతాలో పడుతుంది. ఆ కోవలోనే సక్సెసైన మోడ్రన్ బ్యూటీస్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు ఉంది. ఈ సెక్సీ గాళ్ సంథింగ్ స్పెషల్. కెరీర్ ఒడిదుడుకులతో ఒకానొక దశలో సూసైడ్ చేసుకోవాలన్నంత భయంకరమైన పొజిషన్ కి చేరిపోయినా.. అన్నిటి నుంచి కంబ్యాక్ అయ్యి సక్సెస్ అందుకుంది. ఇది స్ఫూర్తిని నింపే జీవితమే.

2009 లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాకీ అలియాస్ జాక్విలిన్ ఈ పదేళ్ల లో సాధించింది చాలానే ఉంది. ప్రస్తుతం 2020 లో కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది. 2019 పాన్ ఇండియా మూవీ సాహో లో స్పెషల్ నంబర్ తో సౌత్ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. ప్రస్తుత హాటెస్ట్ గాళ్స్ లో జాక్విలిన్ పేరు టాప్ ప్లేస్ లో ఉంది. ఈ స్థాయికి ఎదగడం అన్నది అంత సులువేమీ కాదు. పట్టుదలతోనే ఇదంతా సాధ్యమైంది. ఇక ఎవరైనా బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఆరంభంలో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇందుకు మినహాయింపేమీ కాదట.

పరిశ్రమలో ప్రారంభ రోజులు ఎలాంటివో జాకీ ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. “నేను ఓ నిర్దిష్టమైన దారిలో వెళ్లాలని పరిశ్రమలో అంతా చెప్పేవారు. నా కనుబొమ్మలను ముదురు రంగులో ఉంచాలని.. నా ముక్కును సరి చేసుకోవాలని కొందరు చెప్పారు. అయితే ఇవేవీ నేను పాటించలేదు. చిన్నప్పటి నుండి నేను ఇష్టపడిన నా ముక్కు ఇది. దానిని మార్చమని ఎవరైనా నన్ను అడుగలా?“ అంటూ జాకీ చెప్పుకొచ్చింది. నా పేరును ముస్కాన్ గా మార్చమని నాకు కొందరు చెప్పారు. నా ఏజెన్సీకి ఇది సూచించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు లో వెస్ట్రన్ స్టైల్లో ఉన్నందున పేరును మార్చుకోవాలా? ఇలాంటి పేరుతో పరిశ్రమను కొల్లగొట్టగలవా? అని అన్నారు. అయినా నేను నా పేరును మార్చుకోవద్దని భావించాను“ అని తెలిపింది.

ఇలాంటి భయానకమైన కథలు ఎన్నో పరిశ్రమ లో ఉన్నాయి. అయినా నేను దేనికీ భయపడలేదు. సర్జరీల పేరుతో కత్తి కోతకు ప్రిపేరవ్వలేదు అని జాకీ వెల్లడించింది. మొత్తానికి ఎవరెలాంటి కామెంట్లు చేసినా తనకు నచ్చినట్టే ఉన్నానని జాకీ క్లియర్ కట్ గా చెప్పేసింది. ఈ పదేళ్లలో మర్డర్ 2- రేస్ 2- హౌస్ఫుల్ 2- హౌస్ ఫుల్ 3- కిక్ వంటి బ్లాక్ బస్టర్లను ఖాతాలో వేసుకున్న జాకీ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉంది. శ్రీమతి సీరియల్ కిల్లర్- కిక్ 2 – ఎటాక్ చిత్రాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer