ఖైదీ అడ్రెస్ లేడే

0

ఊపిరి దాకా తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరో కార్తీ ఆ తర్వాత వరస డిజాస్టర్లతో అంతకంతా బ్రాండ్ కు చేటు తెచ్చుకున్నాడు. గత చిత్రం దేవ్ ఎంత దారుణంగా దెబ్బ తిందంటే ఈ పేరుతో ఓ సినిమా వచ్చిందని టీవీలో వచ్చే దాకా ప్రేక్షకులకు తెలియనంత. అక్కడ తమిళ్ లోనూ మనోడి పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. చినబాబు ఓవర్ సెంటిమెంట్ తో ఓ మాదిరిగా ఆడినా పెద్దగా కలిగిన ప్రయోజనం ఏమి లేదు.

కార్తీ రాబోతున్న కొత్త సినిమా ఖైదీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తోంది. కానీ ఎప్పుడు రావాలో అర్థం కానీ అయోమయంలో డేట్ ని వాయిదా వేసుకుంటూ పోతోంది. ఇప్పటికీ దీనికి సంబంధించి క్లారిటీ లేదు. ఖైదీ టీజర్ రిలీజై రెండు నెలలు దాటేసింది. క్రైమ్ ఛేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఖైదీ డిఫరెంట్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ హీరోయిన్ లాంటి రొటీన్ అంశాలు లేకుండా కొత్త తరహా స్క్రీన్ ప్లే తో దీన్ని తెరకెక్కించారు.

కార్తీ గెటప్ కూడా ఊర మాస్ గా కనిపించడం ఫ్యాన్స్ మధ్య వైరల్ అయ్యింది. ఒకరకంగా ఎక్స్ పరిమెంట్ తరహా సినిమా కాబట్టి పోటీ లేకుండా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లానింగ్ చేస్తున్నారు. సూర్య బందోబస్త్ కనక ముందు అనుకున్న తేదీ ఆగస్ట్ 15 వచ్చి ఉంటే ఖైదీకి రూట్ క్లియర్ అయ్యేది. సాహో వల్ల తేదీని రెండుసార్లు మార్చుకుంది. సో ఖైదీకి మోక్షం అంత ఈజీగా దక్కేలా లేదు. అసలే మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ టైటిల్ ఇది. అలాంటిది కార్తీ వాడుకున్నాడు కాబట్టి ప్రెజెంటేషన్ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి.