మోడీ ఇచ్చిన సలహాల్ని తాజాగా రివీల్ చేసిన డార్లింగ్

0

ఇప్పుడు ఎక్కడ చూసినా సాహో చిత్రం గురించి.. ఆ చిత్ర హీరో డార్లింగ్ ప్రభాస్ గురించే చర్చంతా. రేపొక్కరోజు (గురువారం) ఆగితే చాలు.. ఉదయాన్నే సాహో షో థియేటర్లలో పడిపోనుంది. ఈ సినిమా కోసం యావత్ భారతంలోని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రూ.350 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రంపైన ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. ఇదిలా ఉంటే.. తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు ప్రభాస్.

బాహుబలి టైంలో ప్రధాని మోడీని కలిసిన సందర్భంలో తనకు ఆయన సలహాలు.. సూచనలు చేసినట్లు చెప్పారు. పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రధానిని కలిసిన సందర్భంగా బాహుబలి గురించి ఆయన చాలా విషయాలు తనను అడిగారని.. ఆ సందర్భంగా ఆయన కొన్ని విషయాల్ని తనతో చెప్పినట్లుగా చెప్పారు. ఇప్పటికి ఆ విషయాలు తన బుర్రలో తిరుగుతూనే ఉన్నాయన్నారు.

కొన్ని ముస్లిం దేశాల షేర్లు చెప్పి అక్కడి ప్రాంతాలు సినిమా షూటింగ్ లకు ఎంతో అనువుగా ఉంటాయని.. వీలుంటే ఫ్యూచర్లో తన సినిమాల్ని అక్కడ షూట్ చూసుకోవాల్సిందిగా మోడీ గుర్తు చేసుకున్నారు. ప్రధాని చెప్పిన ప్రదేశాల్లో తాజా సాహో చిత్రాన్ని షూట్ చేయలేకపోయామని.. కాకుంటే రానున్న రోజుల్లో తన సినిమాల్ని అక్కడ షూట్ చేసే ప్రయత్నం చేశామన్నారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా మోడీ మాట్లాడిన తీరు.. సినిమాల విషయంలో ఆయనకున్న అవగాహన చూసి తనకెంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. ఆయన మంచితనం తనను కట్టిపడేసిందన్న ఆయన.. రాజకీయాలు తన ఒంటికి పడవని తేల్చేశారు. తన మైండ్ సెట్ కు రాజకీయాలు ఏ మాత్రం సైట్ కావని చెప్పారు. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 నిర్వీర్యం చేసిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. బాలీవుడ్ తో పాటు దేశంలోని అన్ని సినిమా పరిశ్రమలు జమ్ముకశ్మీర్ లో షూటింగ్ లు జరుపుకోవాలన్న ఆకాంక్షను ప్రధాని మోడీ వ్యక్తం చేశారని.. తన తర్వాతి సినిమాల్లో అక్కడ షూట్ చేసే ప్రయత్నం చేస్తామన్నారు ప్రభాస్. ఇన్నాళ్ల తర్వాత మోడీతో తన భేటీ సందర్భంగా జరిగిన ముచ్చట్లను తెలివిగా రివీల్ చేశారని చెప్పాలి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home