అంబానీ భార్యతో సంజయ్ దత్ ప్రేమాయణం…?

0

సినీ ఇండస్ట్రీ లో సెలబ్రిటీస్ మధ్య ఎఫైర్స్ అనే మాట ఎప్పుడూ వింటూనే ఉంటాం. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇలాంటి వాటి గురించి ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. అక్కడ ఎప్పుడు లవ్ చేసుకుంటారో ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో ఎవరికి తెలియదు. ప్రేమలో పడటం.. బ్రేకప్ చెప్పుకోవడం.. మళ్లీ ప్రేమలో పడటం అన్నీ కామనే. వాళ్ళు స్టార్ హోదాను మరచిపోయి ప్రవర్తిస్తూ కెమెరాకు చిక్కిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు వీటి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ప్రస్తుతం కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో సినీ అభిమానులు సినీ సెలబ్రిటీస్ కి సంభందించిన పాత వివరాలు బయటకి తీస్తున్నారు. ఒకప్పుడు వారు చేసిన కాంట్రవర్సీ కామెంట్స్.. హీరో హీరోయిన్స్ కి సంబంధించిన అఫైర్స్ అన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసి తెగ వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ – హీరోయిన్ టీనా మునిమ్ కు మధ్య నడిచిన ప్రేమాయణం.. అప్పట్లో సంజయ్ వారి రిలేషన్ షిప్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. టీనా మునిమ్ అంటే ఎవరో కాదండోయ్ రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ భార్య.

కాగా సంజయ్ దత్ – టీనాలు చిన్నతనం నుంచే మంచి స్నేహితులుగా ఉండేవారట. సంజయ్ రెండో చిత్రం ‘రాకీ’ లో టీనా మునిమ్ హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలో వారిద్దరి రిలేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. తన కెరీర్ స్టార్టింగ్ లో టీనా మునిమ్తో తనకున్న సంబంధం గురించి అప్పట్లో సంజయ్ మాట్లాడిన విషయం ఇప్పుడు మరోసారి తెర మీదకు వచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో సంజయ్ మాట్లాడుతూ… ”నేను టీనాను ప్రేమించాను. కానీ ఆ విషయం బయట పెట్టలేదు. టీనా ఎప్పుడు నన్ను నా తండ్రి లేదా సోదరి దగ్గర ఉండమని చెప్పేది. నా తల్లి నర్గీస్ మరణం సమయం లో టీ నా నాకు తోడు గా ఉంది” అని వెల్లడించారు. ” మా అమ్మ మరణంతో నా జీవితంలో ఖాళీ ఏర్పడింది. ఆ సమయంలో ఆ ఖాళీని టీనా భర్తీ చేసింది. మా అమ్మలాగే అన్ని విషయాల్లో నా మంచి కోసం నన్ను ఒత్తిడి చేసేది. అయితే టీనా పలు సందర్భాల్లో తన కెరీర్ విషయంలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ నేను అవకాశం ఇవ్వలేదు” అని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా బాలీవుడ్ బ్యాడ్ బాయ్ గా ముద్ర వేసుకున్న సంజూ భాయ్ – టీనా ల మధ్య ఎలాంటి వివాదం లేక పోయినా దూరం ఏర్పడిందని తెలుస్తోంది. సంజయ్ డ్రగ్స్ కి బానిసై చికిత్స కోసం విదేశాలకు వెళ్లటంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయిందట. ఇక సంజయ్ దూరమైన తరువాత టీనా కొంత కాలం హీరో రాజేష్ ఖన్నాతో రిలేషన్ లో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అంబానీల వారసుడు అనిల్ అంబానీ ని పెళ్లాడి అంబానీ ల ఇంటి కోడలైంది. ఇక సంజయ్ దత్ జీవితం లాగే పెళ్లి కూడా ఎన్నో మలుపులు తిరిగింది. అతని ఫస్ట్ వైఫ్ క్యాన్సర్ వ్యాధి తో చని పోయింది. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకో గా ఆమె సంజూ భాయ్ నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం మూడో భార్య మాన్యత తో కలిసి ఉంటున్నాడు సంజయ్ దత్.
Please Read Disclaimer