స్టార్ కొడుక్కి డేట్ దొరికింది

0

ఒకే కథను రెండు సార్లు ఇద్దరు వేర్వేరు దర్శకులతో షూటింగ్ జరుపుకున్న అరుదైన ఘనతను అందుకున్న అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ ఆదిత్య వర్మ ఎట్టకేలకు ఓ డేట్ లాక్ చేసుకుంది. చెన్నై రిపోర్ట్స్ ప్రకారం సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఆ డేట్ కి ఇతర భారీ సినిమాలు ఏవీ లేకపోవడంతో విక్రమ్ కూడా దీనికే పాజిటివ్ గా ఉన్నాడని తెలిసింది. ఇంకొద్ది రోజుల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసే ఛాన్స్ ఉంది.

ముందు 20 అనుకున్నారు కానీ సాహో కోసం డేట్ మార్చుకుని సూర్య కాప్పన్ ఆ తేదీకి షిఫ్ట్ కావడంతో ఆదిత్య వర్మకు వేరే దారి లేకపోయింది. అక్టోబర్ లో సైరా – వార్ లాంటి క్రేజీ హై బడ్జెట్ మూవీస్ షెడ్యూల్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇదే సేఫ్ అని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. షూటింగ్ త్వరగానే పూర్తయినా కబీర్ సింగ్ అనూహ్యంగా బ్లాక్ బస్టర్ కావడంతో అనవసరమైన పోలికలు వస్తాయని భావించిన యూనిట్ రిలీజ్ ని పెండింగ్ లో పెట్టింది

సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరిసాయ దర్శకత్వం వహించిన ఈ మూవీ అతి త్వరలోనే సెన్సార్ కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా జరుగుతోంది. ధృవ్ ఇప్పటి నుంచే ప్రమోషన్ మొదలుపెట్టేశాడు. వివిధ కాలేజీలకు వెళ్లి స్టూడెంట్స్ ని ఫ్యాన్స్ ని కలుసుకుని తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసే పనిలో పడ్డాడు. ఫైనల్ వెర్షన్ పట్ల విక్రమ్ చాలా హ్యాపీగా ఉన్నాడని ఆల్రెడీ రెండు సార్లు సౌత్ లోనూ నార్త్ లోనూ ప్రూవ్ అయిన సబ్జెక్టు కాబట్టి బ్లాక్ బస్టర్ తో డెబ్యూ ఖాయమన్న ధీమాలో ఉన్నట్టుగా అక్కడి న్యూస్. మొత్తానికి పుత్రోత్సాహం అనుభవించే క్షణాలు చియాన్ విక్రమ్ కు వచ్చే నెలలోనే రాబోతున్నాయన్న మాటPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home