కొత్త తరం స్టార్ హీరోయిన్లు ఎక్కడ?

0

ప్రతి జెనరేషన్ లో స్టార్ హీరోలు ఉంటారు. తరం మారే కొద్దీ కొత్త స్టార్ హీరోలు వస్తుంటారు. అయితే ఈ మార్పుకు చాలా సమయం పడుతుంది. హీరోయిన్ల విషయంలో అలా కాదు. ప్రతి నాలుగైదేళ్ళకు ఓ జెనరేషన్ మారిపోతుంటుంది. కొంతకాలం క్రితం స్టార్ హీరోయిన్లు ఎవరంటే అనుష్క.. సమంతా.. కాజల్.. తమన్నా.. శ్రియ పేర్లు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఈ లిస్టులో ఉండే హీరోయిన్లను అసలు స్టార్ హీరోలసినిమాలకు పరిశీలిస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి.

సీనియర్ స్టార్లు..తమకు సరైన జోడీ దొరక్క వీరిలో కొందరిని తీసుకుంటున్నారు. ఇక అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పరిమితం అయిపోయింది. సమంతా కూడా వివాహం తర్కాత దాదాపు అదే బాటలో ఉంది. అయితే ఈ స్థాయిలో గ్లామర్ ప్లస్ నటన ఉండే హీరోయిన్లు కొత్తతరంలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. పూజా హెగ్డేకి మంచి క్రేజ్ ఉంది కానీ నిఖార్సైన హిట్ ఒక్కటి కూడా లేదు. రష్మికకు కొంత క్రేజ్ ఉంది కానీ స్టార్ హీరోల సినిమాలలో ఇప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి. స్టార్ డం సాధిస్తుందా లేదా అనేది కొంతకాలం ఆగితే కానీ తెలియదు. రాశి ఖన్నా లాంటి వారు కొంతమంది ఉన్నప్పటికీ పెద్ద స్టార్ హీరోలు ఆఫర్లు ఇవ్వడం లేదు. ఇక మిగతా హీరోయిన్లు ఇలా ఒక సినిమా రెండు సినిమాలలో మెరిసి మాయమైపోయేవారే.

మరి కాజల్.. తమన్నా.. అనుష్క.. సమంతాల తరహాలో మాస్ ఆడియన్స్ లో గుర్తింపు సాధించే సత్తా ఉన్న హీరోయిన్లు న్యూ జెనరేషన్ టాలీవుడ్ భామల్లో ఎవరూ కనిపించకపోవడం ఆశ్చర్యమే. ఈ సీనియర్ హీరోయిన్ల స్థానాన్ని భర్తీ చేసే హీరోయిన్లు ఎవరో.. ఎప్పుడు వస్తారో వేచి చూడాలి. ఇలా స్టార్ హీరోయిన్లకు డిమాండ్ ఉండడం కొత్త హీరోయిన్లకు సువర్ణావకాశం అనే చెప్పాలి.
Please Read Disclaimer