నెక్స్ట్ సినిమా ఏది ఏజెంట్?

0

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన హీరో నవీన్ పోలిశెట్టి. మొదటి సినిమాతోనే నటన విషయంలో..లుక్స్ విషయంలో మంచి మార్కులు తెచ్చుకోవడంతో టాలీవుడ్ లో నవీన్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని అంచనాలు వెలువడ్డాయి. ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా రెండు మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని నవీన్ కూడా వెల్లడించాడు.

అయితే ఇంతవరకూ నవీన్ సోలో హీరోగా నటించే కొత్త సినిమా ప్రకటన మాత్రం రాలేదు. నాగ్ అశ్విన్ నిర్మాణంలో కేవీ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జాతిరత్నాలు’ సినిమాలో నవీన్ హీరోగా నటిస్తున్నాడు కానీ ఇందులో నవీన్ సోలో హీరో కాదు. ఈ సినిమాలో ప్రియదర్శి.. రాహుల్ రామకృష్ణ కూడా లీడ్ యాక్టర్సే. మరి నవీన్ సోలో హీరోగా నటించే సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఒక్కటి కూడా రాకపోవడం ఆశ్చర్యమే.

నవీన్ సినిమా ఏజెంట్ ఆత్రేయ జులై లో రిలీజ్ అయింది. అ తర్వాత నవీన్ నటించిన హిందీ చిత్రం ‘చిచోరే’ రిలీజై అది కూడా విజయం సాధించింది. ఇంత సక్సెస్ లో ఉన్న టాలెంటెడ్ హీరోపై పెద్ద బ్యానర్లు.. దర్శకులు దృష్టి సారించడం లేదా?.. ఏమైందో మరి!
Please Read Disclaimer