ప్రమోషన్స్ ఎక్కడ అర్జున్ ?

0

‘స్వామి రారా’ ‘కార్తికేయ’ తర్వాత సోలో హీరోగా వెను తిరిగి చూసుకోలేదు నిఖిల్. వరుసగా అపజయాలు అందుకుంటున్నా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే అలా స్పీడ్ గా కొనసాగుతున్న ఈ కుర్ర హీరో కెరీర్ కి బ్రేక్ వేసింది ‘అర్జున్ సురవరం’. ఏ ముహూర్తాన సినిమా మొదలైందో కానీ అన్ని అడ్డంకులే. ఎట్టకేలకు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

సినిమా షూటింగ్ లో ఉండ గానే ప్రమోషన్ మొదలు పెట్టారు మేకర్స్. కాకపోతే ఆ ప్రమోషన్స్ అన్నీ వృధా అయ్యాయి. కారణం సినిమా కు టైటిల్ మారడమే. ‘ముద్ర’ అనే టైటిల్ జనాల్లోకి వెళ్లిన తర్వాత అనుకోకుండా టైటిల్ మార్చాల్సి వచ్చింది. దాంతో ‘అర్జున్ సురవరం’ అని టైటిల్ మార్చి మళ్లీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. కానీ రిలీజ్ ఆలస్యం అవ్వడం తో ఆ ప్రమోషన్స్ కూడా బురద లో పోసిన పన్నీరయ్యాయి.

సినిమా ఇదే నెల లో 29న థియేటర్స్ లోకి వస్తుంది. అయితే ఇంత వరకూ ప్రమోషన్స్ లో స్పీడ్ కనిపించడం లేదు. నిఖిల్ ఒక్కడే ట్విట్టర్ లో ప్రమోషన్ చేసుకుంటున్నాడు. సరైనా ప్రమోషన్స్ లేక పోతే సినిమాకు ఓపినింగ్స్ కూడా ఉండవు. అది మాత్రం పక్కా. మరి ఓపినింగ్స్ దృష్టి లో పెట్టుకొని వచ్చే వారం నుండైన ప్రమోషన్స్ చేస్తారేమో చూడాలి.
Please Read Disclaimer