దబాంగ్ -3 జండూభామ్ సిగ్నేచర్ ఏది భాయ్?

0

దబాంగ్ చిత్రంలోని `మున్ని బదనామ్ హుయ్` ఐటమ్ గీతం అప్పట్లో భాషతో సంబంధం లేకుండా అన్నిచోట్లా ఓ ఊపు ఊపేసింది. మలైకా అరోరా జండుభామ్ సిగ్నేచర్ స్టెప్ ఆ పాటకే హైలైట్. ఇంకా సోనూసూద్- సల్మాన్ ఖాన్- అమితాబ్ బచ్చన్ డూప్ పాత్ర ఆ పాటలో మరింత జోష్ ని నింపాయి. దబాంగ్ ని అమాంతం పైకి లేపిందంటే ఆ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా దబాంగ్ -3లో సల్మాన్ ఖాన్- ప్రభుదేవా ద్వయం అలాంటి ప్రయత్నం చేసారు.

దబాంగ్-3 కోసం `మున్నా బదనాయ్ హుయ్..` అంటూ సీక్వెల్ సాంగ్ చేసారు. బ్లాక్ బస్టర్ పాటకు సీక్వెల్ గా మున్నా బదనామ్ హు అనే పల్లవితో మంచి ఊపున్న ఐటం నెంబర్ తో ట్రీటివ్వాలనుకున్నారు. తాజాగా ఆ సాంగ్ ఫుల్ వీడియోను ఇటీవల యూ ట్యూబ్ లో కి రిలీజ్ చేసారు. ఆ పాటలో న్యూ గాళ్ వారీనా హుస్సేన్ నర్తించింది. అయితే ఈ పాట ఆశించినంత స్థాయిలో లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఒరిజినల్ ని చెడగొట్టారని అభిమానుల నుంచి విమర్శలొచ్చాయి.

మలైకా స్టెప్పులు ఎక్కడ? ఆ నడుం ఒంపు వారీనాలో ఎక్కడ? ఆ పాటలో ఒక్కటైనా సిగ్నేచర్ స్టెప్ ఉందా? అంటూ నెటిజనులు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. సల్మాన్ ఖాన్ కాసేపు నవ్వించినా సాంగ్ కొరియోగ్రఫీలో ఏ మాత్రం కొత్త దనం లేదని.. ప్రభుదేవా రొటీన్ గా కంపోజ్ చేసాడని విమర్శలొస్తున్నాయి. ఈ భారీ చిత్రానికి మాస్ ఇమేజ్ తీసురావడంలో ఆ పాట పూర్తిగా ఫెయివుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి
Please Read Disclaimer