పూనమ్ కౌర్ ట్వీట్ ఎవరి మీద.?

0

పూనమ్ కౌర్.. ఈ టాలీవుడ్ నటి హీరోయిన్ అప్పట్లో కత్తి మహేష్-పవన్ కళ్యాణ్ వివాదం మీద ట్వీట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఈ వివాదంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొంతమంది నెటిజన్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. సినిమాల కంటే కూడా ఆ వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఈ మధ్య సినిమాలను బాగా తగ్గించేసిన అమ్మడు చాలా రోజుల గ్యాప్ తర్వాత మరోసారి ట్విట్టర్ లో ఓ హాట్ కామెంట్ చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది.

పూనమ్ కౌర్ హాట్ ట్వీట్ చేసింది.. ‘ ఒక అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కావచ్చు.. కానీ ఎప్పటికీ నాయకుడు కాలేడు’ అన్నది పూనమ్ ట్వీట్ సారాంశం. సదురు రాజకీయ నాయకుడి పేరు చెప్పకుండా పూనమ్ తన ఆవేదనను ఆక్రందనను ట్వీట్ లో కుండబద్దలు కొట్టడం చర్చనీయాంశమవుతోంది. పూనమ్ ఇన్ డైరెక్ట్ గా చేసిన ఈ ట్వీట్ ఎవరి గురించి అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరుగుతోంది.

ఎప్పుడో మరుగున పడిన వివాదాలను పూనమ్ మళ్లీ తెరపైకి తీసుకొచ్చి లైమ్ లైట్ లోకి రావడానికే ఇలా ట్వీట్ చేసిందన్న వాదన వినిపిస్తోంది. కొంతమంది నెటిజన్లు అయితే ఈ ట్వీట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించే చేసి ఉంటుందని కామెంట్స్ ద్వారా అభిప్రాయపడుతున్నారు. కానీ పూనమ్ నిజంగా ఈ ట్వీట్స్ ఎవరిని ఉద్దేశించి చేసిందనేది మాత్రం తెలియరావడం లేదు. దీనిపై ఆమెనే డైరెక్ట్ గా స్పందించాలని నెటిజన్లు ఆమె సోషల్ మీడియా ఖాతాలో కోరుతున్నారు.
Please Read Disclaimer