`సాహో`కి నం.2 స్థానం ఖాయమైనట్టే.. నం.1కి ఛాన్స్?

0

డార్లింగ్ ప్రభాస్ తన రికార్డుల్ని తానే బ్రేక్ చేయబోతున్నాడా? అంటే అవుననే అంచనా వేస్తోంది ట్రేడ్. ఇప్పటివరకూ ఇండియాలో ఏ రికార్డు చూసినా `బాహుబలి 2` పేరిట నిక్షిప్తమై ఉంది. ఇప్పుడు ఆ రికార్డుల్ని చాలా వరకూ సాహో వేటాడనుందని తెలుస్తోంది. అయితే అన్నిచోట్లా బ్రేక్ చేస్తుందా? అంటే అవునని చెప్పలేం. అలాగని కాదని చెప్పలేం. ఓపెనింగ్ డే.. ఓపెనింగ్ వీకెండ్ రికార్డుల్ని సాహో చాలా వరకూ బ్రేక్ చేసే ఛాన్సుందని అంచనా వేస్తున్నారు.

అసలు ఈ రికార్డుల్ని ఏఏ ప్రమాణాల్లో చూస్తారు? అంటే.. ఎంజీలు(మినిమం గ్యారెంటీ)- ఎస్.జీ (షేర్ గ్యారెంటీ)లు- హైర్స్ (ఆల్రెడీ వచ్చినవి) వగైరా పరిశీలించి ఈ అంచనాకి వస్తారు. ఇప్పటివరకూ పరిశీలిస్తే తెలుగు వెర్షన్ – హిందీ వెర్షన్ పరంగా నాన్ బాహుబలి కేటగిరీలో సాహో సంచలనాలు ఖాయమైనట్టే. ఇండియా వైడ్ ఈ రెండు వెర్షన్లతో భారీ రేంజు కలెక్షన్స్ రానున్నాయి. ఇక సాహో ఫైనల్ కలెక్షన్స్ రేంజును డిసైడ్ చేసేది హిందీ బాక్సాఫీస్ వద్ద డే వన్ ఎంత వసూలు చేసింది? అన్నదానిపైనే ఆధారపడి ఉంటుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఓపెనింగ్ డే వసూళ్లలో.. బాహుబలి 2- 124 కోట్ల నెట్ .. 2.0 – 59 కోట్ల నెట్.. అవెంజర్స్ ఎండ్ గేమ్- 53.10 కోట్ల నెట్.. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్- 52.25 కోట్ల నెట్.. కబాలి-47.4 కోట్ల నెట్ తో తొలిరోజు ఇండియా వైడ్ టాప్ 5లో నిలిచాయి. అయితే `సాహో` వీటిలో ఇప్పటికే టాప్ 2 పొజిషన్ ఖాయం చేసుకునే వీలుందని అంచనా వేస్తున్నారు. అది క్రాస్ చేసి బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

అలాగే తెలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే.. బాహుబలి 2 దాదాపు 42.47 కోట్ల వసూళ్లతో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత అజ్ఞాతవాసి- 27 కోట్లు.. అరవింద సమేత -26 కోట్లు వసూలు చేసి టాప్ 23 స్థానాల్లో నిలిచాయి. వారం ముందే అంచనాల ప్రకారం.. సాహో హిందీలో 30 కోట్ల పైగా నెట్ వసూలు చేయనుందని ఓ అంచనా. తమిళంలో.. తెలుగులో బాహుబలి2 డే వన్ రికార్డుల్ని సాహో బీట్ చేయనుందని అంచనా. ప్రీమియర్లతోనే అమెరికాలో `సాహో` 2 మిలియన్ డాలర్ల వసూళ్లను అధిగమించనుందని తెలుస్తోంది. దీంతో సాహో రియాలిటీ ఏమిటి అనేది ముందే బయటకు తేలినట్టే. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగుల్లోనే బాహుబలి 2ని అధిగమిస్తుందని భావిస్తున్నారు. కొన్ని ఏరియాల్లో ఈ ఫీట్ ఇప్పటికే అయిన బుకింగ్స్ తోనే సాధ్యమైంది. టాప్ 2 ఓపెనింగ్ డే సినిమాగా గ్యారెంటీ వచ్చేసింది. అయితే ఓవరాల్ కలెక్షన్లలో టాప్ వన్ స్థానంలో ఉంటుందా లేదా? అన్నది కాస్త వేచి చూడాలి.
Please Read Disclaimer