విజయ్ సినిమాకు తగ్గిన డిమాండ్!

0

తమిళ స్టార్ హీరో విజయ్ చాలాకాలంగా తెలుగు మార్కెట్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. కొన్ని సినిమాలు ఫరవాలేదని కూడా అనిపించుకున్నాయి. అయితే విజయ్ కొత్త సినిమా ‘మాస్టర్’ కు మంచి రేట్ పలికే అవకాశాలు తక్కువ ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

దీనికి కారణం విజయ్ లాస్ట్ సినిమా ‘విజిల్’ మాత్రం బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తీసుకొచ్చిందట. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విజిల్’ తమిళ నాట సూపర్ హిట్ గా నిలిచినా తెలుగులో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. ‘విజిల్’ సినిమాకు దాదాపు 9 కోట్ల రూపాయలకు కొన్నారని సమాచారం. కానీ మొత్తం పెట్టుబడిని వెనక్కు తీసుకురాలేకపోయింది. దీంతో ఈ సినిమా ప్రభావం విజయ్ నెక్స్ట్ సినిమాపై పడుతోందట. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘మాస్టర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు 5 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట.

యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ ‘మాస్టర్’ లో విజయ్ తో పాటుగా విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 8 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-