ఆ మలయాళ రీమేక్ లో హీరోలు వాళ్లేనా..?

0

‘అయ్యప్పనుమ్ కోసియుమ్’…ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇది మలయాళం లో రీసెంటుగా విడుదలై ఘన విజయం సాధించిన ఒక సినిమా. ఈ సినిమా లో పృథ్వీరాజ్ బిజూ మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు చూస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ లో సూర్య కార్తీలు చేస్తున్నట్లు కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. మన తెలుగు విషయానికి వస్తే ఈ సినిమా రీమేక్ రైట్స్ హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సొంతం చేసుకున్నారని సమాచారం. అయితే ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. ఇందులో ఎవరు నటించబోతున్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మొన్నటి దాకా విక్టరీ వెంకటేష్ – రవితేజల తో రిమేక్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిన్న బాలయ్య – ఎన్టీఆర్ కలిసి చేస్తున్నారంటూ మరో వార్త బయటకు వచ్చింది. మన ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా.. చిన్న పుకారు పుట్టిస్తే అది ఏ రేంజ్ లో షికారు చేస్తుందో చెప్పలేము. అయితే ఇవన్నీ పుకార్లని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని పెద్ద హీరోల తో నిర్మించాలని నిర్మాణ సంస్థ అనుకోవడం లేదంట. టాలీవుడ్ లోని ఇద్దరు మీడియం రేంజ్ హీరోలతో తీస్తే ప్రాజెక్ట్ వర్క్ ఔట్ అవుద్దని నిర్మాతలు భావిస్తున్నారట. ఎలాంటి ఫ్యాన్ బేస్ లేని హీరోలైతే ఈ కథకి సరిపోతారని హారిక హాసిని వాళ్ళు అనుకుంటున్నారట. ఈలోపు వాళ్ళతో తీస్తారు వీళ్ళతో తీస్తారు అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. ‘అయ్యప్పనుమ్ కోసియుమ్’ కథ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఇగో వల్ల వాళ్ళ జీవితాల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఉంటుందట. పృథ్వీరాజ్ బిజూ మీనన్ లు ఈ పాత్రలను చాలా చక్కగా పోషించి చిత్ర విజయానికి కారణమయ్యారు. మరి మన టాలీవుడ్ లో ఈ పుకార్లకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో. ఈ చిత్రం ఎవరితో తీస్తారనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-