ప్రభాస్ మల్టీప్లెక్స్ లాంచ్ అతిధులెవరు?

0

డార్లింగ్ ప్రభాస్ నటించిన `సాహో` ఆగస్టు 30న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ బిజీబిజీగా ఉన్నారు. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో సునామీ పర్యటనలతో ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది కానీ.. ఈనెల 30న లాంచింగ్ కి రెడీ అవుతున్న `V ఎపిక్` మల్టీప్లెక్స్ థియేటర్ ని లాంచ్ చేసేందుకు ప్రభాస్ అతడి స్నేహితుల బృందం ఎవరెవరిని అతిధులుగా ఆహ్వానించారు? అంటే అందుకు సంబంధించిన సరైన సమాచారం లేదు.

నెల్లూరు సూళ్లూరుపేటలో `వీ-ఎపిక్` మల్టీప్లెక్స్ ఈనెల 30న ప్రారంభోత్సవానికి ముస్తాభవుతోంది. మల్టీప్లెక్స్ చెయిన్ బిజినెస్ లో భాగంగా ప్రభాస్ – ప్రమోద్ – వంశీ (యు.వి.క్రియేషన్స్) స్నేహితుల బృందం చేస్తున్న తొలి ప్రయత్నమిది. మునుముందు ఈ రంగంలో ఫ్రెండ్స్ అంతా కలిసి భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని ఇదివరకూ ప్రచారమైంది. ఈ ఫ్రాంఛైజీలో మొదటి వెంచర్ `సాహో` రిలీజ్ డేతోనే మొదలవుతోంది. మరి అలాంటప్పుడు `వీ ఎపిక్` ప్రారంభోత్సవానికి .. ఇందులో సాహో చిత్రం వీక్షించేందుకు భారీ గెస్టులు ఉంటారని అభిమానులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు ప్రభాస్ ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు? అంటే .. అసలు తనే ఈ వేడుకకు హాజరవుతారా లేదా? అన్నది సందిగ్ధంలో పడిందట. ఓవైపు సాహో చిత్రం టెన్షన్ లో ఉండే ప్రభాస్ ఈ వేడుకకు హాజరు కావడం లేదని తెలిసింది. దీంతో పవన్ కల్యాణ్- మహేష్ లేదా రామ్ చరణ్- ఎన్టీఆర్ రేంజు స్టార్లు ఈ లాంచింగ్ వేడుకకు ఎటెండయ్యేందుకు ఆస్కారం లేదని భావిస్తున్నారు.

ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు – సుజీత్ అలాగే సాహో నిర్మాతలు ప్రమోద్- వంశీ ఈ మల్టీప్లెక్స్ లాంచ్ వేడుకకు ఎటెండ్ కానున్నారట. అలాగే నెల్లూరు భాజపా నాయకులు ఎటెండయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అతిధులు ఎవరు? అన్నది వీఎపిక్ స్టాఫ్ ఎవరూ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. మరో ఐదారు రోజుల సమయం ఉంది కాబట్టి ఈలోగా ప్రకటిస్తారేమో చూడాలి.
Please Read Disclaimer