ఆ ఇద్దరు ఎవరు సామ్

0

గత ఏడాది బ్లాక్ బస్టర్స్ ప్లాప్స్ సమానంగా అందుకున్న సమంతా ఈ నెలాఖరు నుంచి మళ్ళి స్పీడ్ పెంచుతోంది. మనం మజిలీ కోసం ఎదురు చూస్తున్నాం కానీ అంతకన్నా ముందే మార్చ్ 29 సూపర్ డీలక్స్ విడుదల కానుంది. విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ గా నటించిన ఈ మూవీలో సమంతా చాలా విభిన్నమైన కిల్లర్ పాత్ర పోషిస్తున్నట్టుగా ఇప్పటికే టాక్ ఉంది. ఇదిలా ఉండగా దీనితో పాటు మజిలి ప్రమోషన్ లో విస్తృతంగా పాల్గొంటున్న సామ్ ఓ ఆసక్తి కరమైన విషయాన్నీ వెల్లడించింది.

సూపర్ డీలక్స్ ఆఫర్ సమంతా కన్నా ముందు వేరే ఇద్దరు హీరొయిన్లకు వెళ్లిందట. వాళ్ళు తిరస్కరించారు. ఇది స్వయంగా దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా వెల్లడించడంతో షాక్ తిన్న సమంతా పూర్తి కథ విని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆపై నిర్మాణం వేగం అందుకుంది. కాని ఆ ఇద్దరి పేర్లు సమంతా కాని త్యాగరాజన్ కాని బయట పెట్టడం లేదు. ఈ దర్శకుడి మీద ఇండస్ట్రీలో రీటేకుల గురించి చాలా కామెంట్స్ ఉన్నాయి. తనకు నచ్చేలా షాట్ వచ్చే వరకు ఎంత సమయమైనా ఎంత ఖర్చైనా తీస్తూనే ఉంటాడని చెప్పుకుంటారు.

సమంతాకు ఆ బాధ తప్పలేదట. అయితే ఇంతకు ముందు త్యాగరాజన్ తో చేసిన ఆర్టిస్టులకు ఐదు నుంచి పది టేకులు అవసరమైతే సాంకు మాత్రం రెండు లేదా మూడు టేక్స్ లోనే అయిపోయేదట. రమ్యకృష్ణ ఫర్హాద్ ఫాసిల్ మిస్కిన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న సూపర్ డీలక్స్ తెలుగు వెర్షన్ అదే తేదికి విడుదల చేస్తారా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Please Read Disclaimer