బిగ్ బాస్ ఈవారం ఎలిమినేట్ ఇతడే..?

0

బిగ్ బాస్ ఫైనల్ అంకానికి చేరువవుతోంది. ఇప్పుడు హౌస్ లో మిగిలి ఉన్న వారందరూ బలమైన కంటెస్టెంట్లే.. ఈ వారం కూడా హౌస్ లోనే అత్యంత బలమైన పోటీదారులైన వరుణ్ సందేశ్ – రాహుల్ సిప్లిగంజ్ – మహేష్ విట్టాలు ఎలిమినేషన్ లో ఉన్నారు. వితికా కూడా నామినేట్ అయినా తన దగ్గరున్న సేవ్ చేసే మెడాలియన్ తో ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది.

కాగా పైనున్న ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ బిగ్ బాస్ ప్రేక్షకులను పట్టిపీడిస్తోంది. అయితే వివిధ సంస్థలు సోషల్ మీడియా ట్రెండింగ్స్ – బిగ్ బాస్ లీక్స్ ను బట్టి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం ఎలిమినేట్ కాబోయేది మహేష్ విట్టా అని తెలుస్తోంది.

మహేష్ విట్టా ఆది నుంచి బలమైన పోటీదారుగా ఎదిగాడు. 12వ వారం వరకూ ఉద్దండులైన వారిని ఇంటికి పంపించి నిలిచాడు. సామాన్యుడి పేదరికపు చాయలు ఉండడం.. అచ్చ పల్లెటూరి పిల్లగాడుగా అందరి మనసును దోచేస్తూ బిగ్ బాస్ లో ఇంతకాలం జర్నీ చేశాడు.

అయితే ఈ వారం బలమైన ప్రత్యర్థులైన వరుణ్ సందేశ్ రాహుల్ దెబ్బకు మహేష్ విట్టానే ఎలిమినేట్ కాబోతున్నాడని ట్రెండ్స్ ను బట్టి తెలుస్తోంది. మహేష్ తో పోలిస్తే టైటిల్ ఫేవరేట్లుగా వరుణ్ – రాహుల్ లకు ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. మహేష్ ఎంత పోటీనిచ్చినా వీరి ధాటికి తట్టుకోలేదని సమాచారం.

ప్రస్తుతం బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ తో ఏడుగురు కంటెస్టెంట్ మిగులుతారు. అంటే వచ్చేవారం మాత్రమే ఫైనల్ కు మిగిలి ఉంది. అంటే వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ పక్కా. ప్రస్తుతం ఉన్న వారిలో వరుణ్ – రాహుల్ – శ్రీముఖి – బాబా భాస్కర్ లు ఫైనల్ 4లో ఉంటారని అంచనాలున్నాయి. ఇక మిగతా స్థానం కోసం శివజ్యోతి – అలీ – వితిక పోటీపడుతున్నారని తెలుస్తోంది. అయితే ఎవరి అంచనాలు ఎలా ఉన్నా మహేష్ విట్టా ఎలిమినేట్ కాబోయేది లేనిది తెలియాలంటే ఆదివారం రాత్రి వరకు షో ముగిసేదాకా ఆగాల్సిందే..




Please Read Disclaimer