కమల్ ఫ్యామిలీ ఫోటోలో ఆవిడెవరు?

0

విశ్వ నటుడు కమల్ హాసన్ రియల్ ఫ్యామిలీ డ్రామా గురించి అభిమానులకు చాలా స్పష్ఠంగా తెలిసిందే. అందాల కథానాయిక సారికను పెళ్లాడిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు. శ్రుతి హాసన్- అక్షర హాసన్ లాంటి గారాల పట్టీలు వారసులుగా అభిమానులకు సుపరిచితం. సారికతో మనస్ఫర్థలు వచ్చి విడిపోయాక.. చాలా కాలం తర్వాత తన కోస్టార్ అయిన గౌతమితో కమల్ సహ జీవనం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే గౌతమి తోనూ మనస్ఫర్థలు తప్పలేదు. కూతుళ్లతో గౌతమి కి పొసగకపోవడం వల్లనే కమల్ ఒంటరివాడయ్యాడని ఆ తర్వాత అభిమానుల్లో గుసగుసలు వినిపించాయి. తన వ్యక్తిత్వాన్ని వదులుకోలేకనే కమల్ నుంచి దూరంగా వెళ్లిపోయానని .. తాను ఆశించిన జీవితం వేరేగా ఉందని ఇటీవల తెలుగు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో గౌతమి వెళ్లడించారు.

ఇదంతా ఫ్లాష్ బ్యాక్ అనుకుంటే.. తాజాగా రివీలైన కమల్ హాసన్ ఫ్యామిలీ ఫోటోలో వేరొక కొత్త ముఖం దర్శనమీయడం ఫ్యాన్స్ లో మరో ఆసక్తికర డిబేట్ కి తెర తీసింది. ఇంతకీ ఎవరావిడ? అంటూ అభిమానులు ప్రత్యేకంగా తరచి తరచి ఆ ఫోటోనే చూస్తున్నారు. ఆమె పూజా కుమార్. కమల్ హాసన్ సరసన విశ్వరూపం ఫ్రాంఛైజీ లో నటించింది. తను బహుశా కమల్ కుటుంబంతో అంత ఇదిగా కలిసిపోవడం వల్లనే ఈ ఫోటోలో కనిపిస్తోందని భావించాల్సి ఉంటుంది. కమల్ హాసన్ అన్నగారు చారుహాసన్ సహా ఈ ఫోటోలో శ్రుతి హాసన్- అక్షర హాసన్.. అమ్మమ్మలు నాయనమ్మలు మనవలు మనవరాళ్లతో ఆ ఫ్యామిలీ వృక్షం మొత్తం కనిపిస్తోంది. విశ్వనటుడి ఫ్యామిలీ పెర్ఫెక్ట్ పిక్చర్ లో ఉన్న పూజా కుమార్ తో కమల్ కి ఉన్న బంధుత్వం ఏమిటి? అన్నది తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer