కాజల్ ఫైనల్ టార్గెట్ ఆయనేనట!

0

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ పుష్కర కాలంగా స్టార్ స్టేటస్ తో కొనసాగుతోంది. తెలుగు మరియు తమిళంలో దాదాపు స్టార్ హీరోలందరితో కూడా నటించేసింది. సీనియర్ స్టార్ హీరోలు.. జూనియర్ స్టార్ హీరోలు అనే తేడా లేకుండా సినిమాలు చేసేసిన కాజల్ ప్రస్తుతం యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. కమల్ తో నటిస్తున్న ఈ నేపథ్యంలో కాజల్ ఇక ఒకే ఒక్క హీరోతో నాకు నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.

పలువురు స్టార్ హీరోలతో నటించిన కాజల్ ప్రస్తుతం రజినీకాంత్ సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ప్రకటించింది. సౌత్ లో రజినీకాంత్ తో నటించాలని స్టార్ హీరోయిన్స్ అంతా కూడా కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు కాజల్ కూడా సూపర్ స్టార్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. సౌత్ లో ఎంతో మంది హీరోలతో నటించాను. ఇక రజినీకాంత్ గారితో నటించే అవకాశం వస్తే చాలన్నట్లుగా కాజల్ పేర్కొంది.

ప్రస్తుతం ఈమె ఇండియన్ 2 చిత్రంతో పాటు మరో రెండు మూడు సినిమాల్లో కూడా నటిస్తోంది. అతి త్వరలోనే రజినీకాంత్ తో కూడా ఈమెకు నటించే అవకాశం దక్కుతుందని ఆశిస్తుంది. రజినీకాంత్ దర్బార్ చిత్రంలో నయనతార నటించగా.. ఆ తర్వాత శివ దర్శకత్వంలో రజినీ చేయబోతున్న సినిమాకు ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. ఆ సినిమాలో రజినీ కోసం కాజల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి శివ తన సినిమాలో కాజల్ ను తీసుకుని ఆమె ఫైనల్ టార్గెట్ రీచ్ అయ్యేలా చేస్తాడా చూడాలి.