టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు?

0

టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో ఎవరంటే టక్కున చెప్పడం కష్టం. అయితే టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు అని అడిగితే దానికి సమాధానం చెప్పడం కూడా కష్టంగానే ఉంది. గతంలో అనుష్క శెట్టి నెంబర్ 1 హీరోయిన్ గా ఉండేది. ఈమధ్య తక్కువగా సినిమాలు చేస్తుండడం.. స్టార్ హీరోల సినిమాల్లో నటించకపోవడంతో అనుష్కకు నెంబర్ 1 స్థానానికి ఎసరొచ్చింది. అయితే టాలీవుడ్ హీరోయిన్లలో ఇప్పటికీ హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునేది మాత్రం అనుష్కనే.

అనుష్క తర్వాత సమంతా నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగింది కానీ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు సామ్ పేరును పరిశీలించడం లేదు. అనుష్కలాగే సమంతా కూడా ఎక్కువగా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలను ఎంచుకుంటోంది. దీంతో సమంతా తర్వాత నెంబర్ 1 హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఇదే తమిళంలో తీసుకోండి.. వెంటనే నయనతార పేరు చెప్తారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కావచ్చు.. స్టార్ హీరోల సినిమాలు కావచ్చు(రజనీకాంత్.. విజయ్ సినిమాల్లో ఇప్పుడు హీరోయిన్) నయన్ కు పోటీనే లేదు. తెలుగుకు వస్తే కాజల్ అగర్వాల్.. తమన్నాలు సీనియర్ హీరోయిన్ల లిస్టులో ఉన్నారు. న్యూ జెనరేషన్ హీరోయిన్లలో పూజా హెగ్డేకి చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి కానీ ఇప్పటివరకూ సూపర్ హిట్లు లేవు. మహేష్ తో నటించిన ‘మహర్షి’ ఒక్కటే పూజా కెరీర్లో ఏకైక హిట్టు. ఇక ‘అల వైకుంఠపురములో’.. ‘జాన్’ సినిమాలు హిట్ అయితే నెంబర్ వన్ రేస్ లోకి వస్తుందేమో చూడాలి.

పూజా కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సాధిస్తున్న మరో హీరోయిన్ రష్మిక మందన్న. అయితే ఈ భామ పరిస్థితి ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్నట్టుగా ఉంది. కియారా అద్వాని తెలుగులో రెండు సినిమాలు చేసిన తర్వాత తిరిగి బాలీవుడ్ వెళ్ళిపోయింది. కొత్త హీరోయిన్లకు ఎవరికైనా అవకాశం ఉందా అంటే చాలామందికి నటన విషయంలో ఓనమాలు కూడా తెలియవనే సంగతి ప్రేక్షకులకే తెలిసిపోతోంది. కొందరికేమో గ్లామర్ ఉండి యాక్టింగ్ ఉండదు. కొందరికి యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి కానీ గ్లామర్ విషయంలో వీక్. కొందరికీ ఈ రెండూ ఉన్నప్పటికీ క్రేజ్ ఉండదు. దీంతో చాలామంది హీరోయిన్లు అసలు ఈ నెంబర్ 1 హీరోయిన్ రేసులోనే ఉండడం లేదు. ఒక్క ముక్కలో చెప్తే “హీరోయిన్ అంటే ఈ బ్యూటీరా.. ఎవరూ పోటీకి రాలేరు” అనిపించే స్టార్ హీరోయిన్ టాలీవుడ్ లో లేదు అన్నది మాత్రం వాస్తవం.Please Read Disclaimer