వెకేషన్ లో సర్ ప్రైజ్ గెస్ట్ ఎవరు?

0

బ్రేక్ దొరికితే చాలు.. మన సెలబ్రిటీలు విదేశీ షికార్లతో చిలౌట్ చేసేందుకు ఏమాత్రం మొహమాటపడడం లేదు. మహేష్.. చరణ్.. బన్ని.. నాగచైతన్య వీళ్లంతా కుటుంబ సమేతంగా విదేశాల్లో నచ్చినట్టు సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్యారిస్.. స్పెయిన్ ఇబిజ.. లండన్.. సింగపూర్.. బ్యాంకాక్.. దుబాయ్.. నగరాలు మన స్టార్లకు రెగ్యులర్ డెస్టినేషన్స్ గా మారాయి. ఇంతకుముందు మహేష్ .. చరణ్ విదేశాల్లో ఫ్యామిలీ వెకేషన్లతో ఎంజాయ్ చేసి వచ్చారు.

ఈసారి నాగచైతన్య- సమంత వంతు. చై- సామ్ జంట ఇంతకుముందు కింగ్ నాగార్జున 60వ బర్త్ డే సెలబ్రేషన్స్ ని స్పెయిన్ ఇబిజలో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తిరిగి షెడ్యూల్స్ తో బిజీ అయ్యారు. రెగ్యులర్ గా ఈ జంట విదేశీ వెకేషన్లతో సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూట్ గ్యాప్ లో ఈ హాట్ కపుల్ సింగపూర్ ట్రిప్ వెళ్లారు. కుటుంబ సభ్యులు సహా కొందరు సన్నిహిత మిత్రులతో కలిసి ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు. స్పాట్ నుంచి తాజాగా కొన్ని ఫోటోలు రివీలయ్యాయి. చైతూ – సమంతతో పాటుగా చై మదర్ లక్ష్మి గారు అమెరికా నుంచి నేరుగా సింగపూర్ లో దిగారని ఈ ఫోటోల్ని బట్టి అర్థమవుతోంది.

కొద్ది రోజుల్లో ఈ వెకేషన్ ముగించి తిరిగి చైతూ.. సమంత ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతారు. చైతన్య తదుపరి శేఖర్ కమ్ములతో కలిసి `లవ్ స్టోరి` చిత్రీకరణలో పాల్గొంటారు. సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సహా ఇతర కమిట్ మెంట్లతో బిజీ అవుతారు. ఫ్యామిలీ లైఫ్.. వృత్తిగతమైన లైఫ్ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ అక్కినేని హీరోలు ఆదర్శంగా నిలుస్తున్నారనే చెప్పాలి.
Please Read Disclaimer