ఆండ్రియా ను బెదిరిస్తున్న ఆ షాడో ఎవరో?

0

2018 లో మీటూ ఉద్యమం హీట్ గురించి తెలిసిందే. హాలీవుడ్ టు బాలీవుడ్ అట్నుంచి టాలీవుడ్ లో అగ్గి రాజుకుంది. ఉవ్వెత్తున ఎగసిన మీటూ ఉద్యమం లో భాగం గా పలువురు నటీ మణులు తమపై జరిగిన అఘాయిత్యాల ను బహి రంగంగా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎక్కువ గా సింగర్ చిన్మయి హైలైట్ అయింది. సీనియర్ లిరిసిస్ట్ వైరముత్తు తనని వేధించారని ఆరోపించారు చిన్మయి. ఇప్పటికీ చిలవలు పలవలుగా ఎవరో ఒకరి పై తను ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. అయితే తాజా గా సింగర్ కమ్ హీరోయిన్ ఆండ్రియా ఈ తరహా లోనే ఓ వివాహితుడి తో పెట్టుకున్న వివాహేతర సంబంధం గురించి ఓ ఇంటర్వూ లో వెల్లడించింది. ఆ వ్యక్తితో శారీరకం సంబంధం పెట్టుకోవడం వల్ల ఎంతో క్షోభ ను అనుభవించానని తెలిపింది. మానసింకం గాను ఇబ్బందుల కు గురైనట్లు వెల్లడించింది.

కానీ ఆ వ్యక్తి వివరాలు మాత్రం రివీల్ చేయలేదు. బాధ నుంచి బయటకు రావడానికి ఆయుర్వేద మందులు వాడానని.. వాటి వల్ల ఉపశమనం పొందానని తెలిపింది. అలాగే ఆ వ్యక్తి వివరాల ను తాను రాసిన ఓ పుస్తకం ద్వారా రివీల్ చేస్తానని వెల్లడించింది. ఆ క్రమం లోనూ ఆండ్రియా తీవ్రమైన ఒత్తిడికి గురైందిట. ఆ వ్యక్తి బెదిరించడం వల్ల పుస్తకం రాయడం పూర్తయినా విడుదల చేయడం లేదని.. ఆ వ్యక్తి కి రాజకీయం గా పెద్ద పలుకబడి ఉందని తెలిపింది. ఆ బెదిరించిన వ్యక్తి ఎవరు? అంటే.. అతడు సినిమాల్లో కూడా నటించడానికి క్లూ ఇచ్చింది. మరి ఆ బుక్ ని డేర్ చేసి రిలీజ్ చేస్తారా? లేదా? అని ప్రశ్నించ గా దానికి తననుంచి సరైన సమాధానం రాలేదు.

ప్రస్తుతం ఆండ్రియా పలు తమిళ సినిమాల్లో నటిస్తోంది. వడ చెన్నై చిత్రం తర్వాత అమ్మడికి అవకాశాలు తగ్గాయి. దీంతో సింగింగ్ పైనే మళ్లీ దృష్టి సారిస్తోందట. నటిగా తన వైపు వచ్చే అవకాశాలను అంగీకరిస్తూ.. పాటలు పాడుతూ కెరీర్ నెట్టుకొస్తుందట. అన్నట్లు ఆ మధ్య సుచీ లీక్స్ లో భాగంగా ఆండ్రియా పేరు ప్రముఖం గా తెర పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఓ ప్రముఖ సంగీత దర్శకుడి తో.. మేల్ సహచరుల తో సన్నిహితం గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో సంచలనం సృష్టించాయి.




Please Read Disclaimer