ఒంటరిగా కలవమన్న స్టార్ హీరో ఎవరు?

0

బాలీవుడ్ ఖల్లాస్ గాళ్ ఇషా కొప్పికర్ ని ఫ్యాన్స్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. తనదైన రూపలావణ్యం వేడెక్కించే వయ్యారంతో దశాబ్ధం పైగానే కుర్రకారు గుండెల్లో నిలిచింది. 1998లో రిలీజైన చంద్రలేఖ చిత్రంలో నాగార్జున సరసన నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగులో పెద్దంతగా వెలగలేదు.

బాలీవుడ్ లో ఆర్జీవీ కంపెనీ లో ఖల్లాస్ గాళ్ గా గుండెలు కొల్లగొట్టింది. ఇటీవల మీటూ వేదికగా సినీపరిశ్రమలో తనకు ఎదురైన వేధింపుల వ్యవహారంపై ఇషా కొప్పికర్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

పురుషాధిక్యత.. నెపోటిజం.. దురుసుతనం.. వేధింపులు.. ఫేవరిజం! వంటి ఎన్నో ఇబ్బందుల్ని తాను ఎదుర్కొన్నానని ఇషా ఓ ఇంటర్వ్యూల్లోనూ చెప్పింది. సినీపరిశ్రమలో బిగ్ స్టార్స్ తో సన్నిహితంగా ఉండే సెక్రటరీలతోనూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకసారి ఓ పెద్ద స్టార్ నన్ను ఎవరూ లేకుండా ఒంటరిగా కలవమని అడిగాడు. కనీసం కార్ డ్రైవర్ కూడా ఉండకూడదని కండీషన్ పెట్టాడు. ఆయనకు ఫుల్ బిజీ షెడ్యూల్ ఉండి కూడా అడిగాడు. అయితే తన ఇంటెన్షన్ ఏమిటో నాకు అర్థమైంది. దాంతో నా నిర్మాతకు ఓ మాట చెప్పాను. నేను నటించేందుకు వస్తాను తప్ప కాంప్రమైజ్ కి రాలేను అని చెప్పేశాను. ఆ తర్వాత నాకు ఊహించని ట్రీట్ ఎదురైంది.

కమిట్ మెంట్ కి అంగీకరించకపోవడంతో..ఆ స్టార్ హీరోకి సన్నిహితంగా ఉండే కథానాయికను ఆ ఆఫర్ వరించింది. అయితే నన్ను ఆ సినిమా నుంచి తొలగించేప్పుడు ఆ నిర్మాత కానీ స్టార్ కానీ నాకు చెప్పనేలేదు. సదరు సూపర్ స్టార్ కి క్లోజ్ రిలేటివ్ ని పెట్టుకున్నారని ఆ తర్వాత తెలిసింది. అయితే ఈ సంగతులేవీ తెలియని తాను రెడీ అయ్యి ఫిలిం ముహూర్తపు షాట్ కి వెళ్లే ముందు ఆ సంగతి వెల్లడైంది.. అని తెలిపింది. పరిశ్రమలో ఎలాంటి సన్నివేశం ఎదురైనా.. నా వెంట నన్ను ఆదుకునే అద్భుతమైన కుటుంబం ఉంది. అందుకే ఇలాంటి అభద్రతా ప్రపంచంలోనూ రాటు దేలాను. తల వొంచకుండా తలెత్తుకుని ఎదిరించాను! అని ఇషా తెలిపింది. ఒంటరిగా ముంబైలో ఉండాలని వచ్చినా నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను తప్ప వేరే సమస్యలేవీ లేవు అని షాకింగ్ నిజాల్ని పూస గుచ్చింది.
Please Read Disclaimer