చెమట కంపు హీరో ఎవరమ్మా?

0

ఆల్ రౌండర్ మంచు లక్ష్మి హోస్టింగ్ చేస్తున్న ‘ఫీటప్ విత్ స్టార్స్’ కార్యక్రమం పలువురు స్టార్ల లోగుట్టును బయట పెట్టేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పడక గది రహస్యాల్ని మంచు వారమ్మాయి ఏమాత్రం మొహమాటం లేకుండా కూపీ లాగేస్తూ వేడెక్కిస్తున్నారు. ఓటీటీ వేదికపై టీఆర్పీల కోసం ఏదైనా చేస్తారు! అనకండి.. కార్యక్రమం అన్నాక ఆమాత్రం మసాలా లేనిదే ఎవరు చూస్తారు?

ఇప్పటికే సమంత.. వరుణ్ తేజ్ లాంటి స్టార్ల లోగుట్టును బయట పెట్టించేశారు. ఇప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ రహస్యాల్ని కూడా మంచు లక్ష్మి ఓపెన్ చేయించేశారు. అయితే రకుల్ తాను బుక్ అవుతుందనుకుంటే ఎదుటివారిని బుక్ చేసింది. ముఖ్యంగా ఓ హీరో లోగుట్టును బయట పెట్టేసి పెద్ద షాకిచ్చింది. అసలింతకీ ఏమిటి ఆ లోగుట్టు అంటారా?

ఆన్ లొకేషన్ ఓ పాటలో హీరోతో రొమాన్స్ చేస్తున్నప్పుడు అతగాడి నుంచి వచ్చే చెమట కంపు తట్టుకోలేక పోయానని రకుల్ బయటకు చెప్పేసింది. ఆ సమయంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదని.. అప్పటికి ఆ సంగతిని సదరు హీరోకి చెప్పలేక చివరికి తనే దూరంగా వెళ్లి పెర్ఫ్యూమ్ కొట్టుకుని మ్యానేజ్ చేసేశానని తెలిపింది. అంతేనా.. రకుల్ ని చూసి సెట్ లో ఉన్న ఇతరులు అదే పని చేశారట. అన్నట్టు రకుల్ బయటపెట్టేసిన ఆ హీరోగారు ఎవరు? అంటే.. అతడు ఎవరో మాత్రం చెప్పలేదు. పైగా ఇంతకుముందే నీకు ఆ పేరు చెప్పాను కదా! అంటూ లక్ష్మీని వారించింది. మొత్తానికి టీవీ షోలో సదరు హీరోగారి పరువు పీకి పందిరేశారు. ఇంతకీ ఎవరా హీరో అన్నది మాత్రం తేలలేదు.
Please Read Disclaimer