సందీప్ ని అంత మాటన్న నిర్మాత ఎవరు?

0

యంగ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించిన `నిను వీడని నీడను నేను` ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కార్తీక్ రాజు దర్శకత్వంలో వెంకటాద్రి టాకీస్ – వి స్టూడియోస్- విస్తా డ్రీమ్ మర్చంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. రర్ జోనర్ లోనే డిఫరెంట్ స్టోరితో అలరిస్తామని సందీప్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. ఈసారి ఎట్టి పరిస్థితిలో హిట్టు కొట్టి తీరతానని అతడు నమ్మకాన్ని వ్యక్తం చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నిన్న ప్రీరిలీజ్ వేడుకలో మాట్లాడిన సందీప్ కాస్తంత ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడం తెలుగు సినీమీడియాలో చర్చకొచ్చింది. ఒకడు ఒక సినిమా తీస్తున్నాడంటే… సంబంధమే లేనోళ్లు ఈ సినిమాను ఆపడానికి బయలుదేరతారు! అంటూ సందీప్ వ్యాఖ్యానించడం చూస్తుంటే అతడికి ఏవరో తెలియని అడ్డంకులు సృష్టించారని అర్థమవుతోంది. హీరోగా నిర్మాతగా తాను చేసే ప్రయత్నానికి ఎవరో ఊహించని విధంగా అడ్డంకులు సృష్టించారా? వెనక్కి పట్టి లాగాలనుకున్నారా? అన్న డిస్కషన్ మీడియాలో సాగింది. అంతగా సందీప్ కిషన్ కి శత్రువులు ఏర్పడ్డారా? అతడు నిర్మాతగా చేస్తున్న ఈ తొలి ప్రయత్నానికి ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయా? అన్న ముచ్చటా వేడెక్కిస్తోంది.

ఇటీవల సందీప్ కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్- టైగర్ చిత్రాలతో విజయాలు అందుకున్నా ఇటీవల వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. అయితే స్వతహాగానే ఇండస్ట్రీలో జనం ఇలాంటి సందర్భాల్లో నెగెటివ్ గా మాట్లాడుకోవడం హార్ట్ చేయడం సహజం. అలా అతడిని తీవ్రంగా హర్ట్ చేసిన నిర్మాతలు ఉన్నారా? ఫలక్ నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్ ఈ వేదికపైనే మాట్లాడుతూ సందీప్ ని ఎవరో నిర్మాత ఏదో అన్నారట. ఆయన సందీప్ కిషన్ చేసిన పాతిక సినిమాలు మర్చిపోయినట్టున్నారు. ఆ సినిమాలు ఇండస్ట్రీలో ఎంతోమందికి భోజనం పెట్టాయి. నేను ముంబైలో ఫిల్మ్ స్కూల్ కి వెళ్లినప్పుడు `షోర్ ఇన్ ది సిటీ` వచ్చింది. అప్పుడు ఇండస్ట్రీలో ఉండిపోవడానికి సందీప్ వచ్చాడు అనుకున్నా.. నా నమ్మకమే నిజమైంది అని అన్నారు.

ఇక ఇదే వేదికపై నిఖిల్ సైతం సందీప్ కి బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.కింద పడిన ప్రతిసారీ పైకి లేస్తాడు. ఈసారి సందీప్ కిషన్ పెద్ద హిట్టు కొడతాడంటూ తనని పొగడ్తల్లో ముంచెత్తాడు. మొత్తానికి సందీప్ విషయంలో సంథింగ్ ఏదో జరిగింది. అతడు చేసే ప్రయత్నానికి ఎవరో అడ్డు తగిలారనే అర్థమవుతోంది. ఇంతకీ ఆ పని చేసింది ఎవరై ఉంటారు? సందీప్ ని అంత మాట అన్న నిర్మాత ఎవరో మరి? అయినా హిట్టొచ్చినప్పుడు చంకనెక్కించుకోవడం.. ఫ్లాపొచ్చినప్పుడు తిట్టేయడం ఇవన్నీ మామూలే ఇక్కడ. దీనికి సందీప్ మరీ అంత ఎమోషన్ అవ్వాలా?
Please Read Disclaimer