తాప్సీ చెంప చెళ్ళుమనిపించిందెవరు?

0

పింక్ – నామ్ షబానా- మన్మార్జియాన్ చిత్రాలతో బాలీవుడ్ లో తాప్సీ ఇమేజ్ అమాంతం పెరిగింది. సౌత్ లో ఐదారేళ్ల పాకులాడినా దక్కనిది బాలీవుడ్ లో స్వల్పకాలంలోనే సంపాదించగలిగింది. ముంబై పరిశ్రమలో తనకంటూ ఓ ఐడెంటిటీ వచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఉమెన్ గా తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవడం .. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో నటిగా నిరూపించుకోవడం తాప్సీకి అన్ని రకాలుగా కలిసొచ్చింది. తన పాత్రల్లో నాయికా ప్రాధాన్యత ప్లస్ అయ్యింది. సామాజిక కోణంలో రకరకాల ప్రయోగాలు గుర్తింపును తెచ్చాయి. ఈ కోవలోనే మరో ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ.

తాప్సీ తదుపరి చిత్రం తప్పాడ్ .. సామాజిక నేపథ్యం ఉన్న సినిమా. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజైంది. టైటిల్ కి తగ్గట్టే తాప్సీ చెంప చెల్లుమనిపించిన వైనం పోస్టర్ లో కనిపిస్తోంది. తీవ్రమైన నొప్పి.. బాధను వ్యక్తం చేస్తున్న ఆ ముఖాకృతిని అద్భుతమైన టైమింగుతో క్యాప్చుర్ చేసి పోస్టర్ గా ఎంపిక చేయడం ఆసక్తికరం.

“క్యా యే బస్ ఇట్ని సి బాత్ హై? క్యా ప్యార్ మెయిన్ భీ జయాజ్ హై? యే # తప్పడ్ కి పెహ్లి హాల లక్ హై!“ అంటూ తాప్సీ ఫస్ట్ లుక్ ని షేర్ చేసింది. పోస్టర్ తో క్యూరియాసిటీని పెంచి ట్రైలర్ తో కొట్టేయాలన్నది ప్లాన్. తప్పాడ్ ట్రైలర్ ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. అనుభవ్ సిన్హా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రత్న పాథక్ షా- మానవ్ కౌల్- డియా మీర్జా- తన్వే అజ్మీ-రామ్ కపూర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Comments are closed.