రాజమౌళికి పోటీ ఎవరు ?

0

ఈ ఏడాది సంక్రాంతి సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర వచ్చిన కలెక్షన్స్ తో నెక్స్ట్ సంక్రాంతికి కొన్ని బడా సినిమాలు రిలీజ్ చేయాలనుకున్నారు నిర్మాతలు. సరిగ్గా డేట్ ప్రకటిద్దామనుకునే లోపు ఎవరూ ఊహించని షాక్ ఇచ్చాడు రాజమౌళి. తారక్ చరణ్ లతో తను తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ను సంక్రాంతి బరిలో దింపాడు. దీంతో ముందే విషయం తెలిసిన కొందరు బడా నిర్మాతలు తప్ప అందరూ ఉలిక్కిపడ్డారు.

అయితే ప్రతీ సంక్రాంతికి రెండు మూడు బడా సినిమాల మధ్య పోటీ అనేది కామన్. వాటి మధ్యలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా దూరడమనేది కూడా చూస్తున్నాం. కానీ వచ్చే సంక్రాంతికి మరెవరికి ఆప్షన్ లేకుండా చేసాడు జక్కన్న. ‘బాహుబలి’ ప్రాంచైజీ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడం పైగా తారక్ రామ్ చరణ్ కాంబోలో అసలు సిసలైన మల్టీ స్టారర్ గా తెరకెక్కనుండడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ భారీ అంచనాలున్నాయి. పైగా ఈ సినిమా ఒక్కటే ‘బాహుబలి 2’ రికార్డులు కొట్టే స్థాయున్న సినిమా అంటూ ట్రేడ్ వర్గాలు ఇప్పటికే అంచనా వేస్తున్నాయి.

మరి ఈ నేపథ్యంలో అసలు సంక్రాంతి కి ఇంకో బడా సినిమా వస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ‘బాహుబలి’ రిలీజ్ సమయంలో అలాంటి సాహసం ఎవరూ చేయలేకపోయారు. మహేష్ లాంటి స్టార్ హీరో కూడా ‘బాహుబలి’ కి సైడ్ ఇచ్చి ‘శ్రీమంతుడు’ సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నాడు. అప్పుడు సీన్ కూడా వేరు. మరి ఇప్పుడు రాజమౌళి ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్నాడు. ఈ టైంలో రాజమౌళి తో పోటీ పడి ముందడగు ఏ దర్శకుడైనా వేస్తాడా.. అసలు హీరో ఎవరైనా అలాంటి సాహసానికి ఒడిగడతాడా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.
Please Read Disclaimer