సాహో – సైరా లలో ఇలాంటి సీన్లు ఎవరికి లాభం!

0

ఈ మధ్య మన తెలుగు దర్శకులు చాలామంది ఆరు పాటలు ఆరు ఫైట్స్ ఫార్ములాని పక్కన పెట్టి కొత్తగా సినిమాలు తీస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా దీనిని బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. దీంతో మన దర్శకులకి హీరోలకి ప్రొడ్యూసర్స్ కి ధైర్యం పెరిగింది. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రాముఖ్యత ఇస్తూ బాలీవుడ్ ని తలదన్నే సినిమాలు చేస్తూ తెలుగు సినిమాని శిఖరం మీద కూర్చోపెడుతున్నారు. కానీ ఎంత ఖర్చు పెట్టిన వెనక్కి తెచుకోగలం అని కాన్ఫిడెంట్ ఉంటే పర్లేదు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఈ మధ్య వస్తున్న మన తెలుగు సినిమాలు ఖర్చు పెట్టాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టు అనిపిస్తుంది.

నెల రోజుల క్రితం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రం విడుదలైంది. అందులో సినిమాకి అసలు ఏ మాత్రం సంబంధం లేని సీన్లు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఫైట్ లో ఒక చీకటి గదిలో ఒక బ్లాక్ పాంథర్ కనిపిస్తుంది. అది అక్కడ ఎందుకు కనిపిస్తుందో డైరెక్టర్ సుజిత్ కే తెలియాలి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సైరా సినిమాలో కూడా ఈ బ్లాక్ పాంథర్ ఒక సీన్ లో కనిపిస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి షిప్ లో బ్లాక్ పాంథర్ ను పంపిస్తారు. నిజంగానే బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి క్రూర మృగాలను ఇండియాకి పంపించారా లేదా అనేది తెలీదు. ఇలాంటి సీన్లు ఈ మధ్య వస్తున్న సినిమాలలో చాలా ఉంటున్నాయి.

ఈ సీన్లు సినిమాలో రిచ్ నెస్ కోసం పెడుతున్నారా నిజంగా కథకి అవసరం అనుకుని పెడుతున్నారా అనేది దర్శకులకే తెలియాలి. ఈ సీన్ల వల్ల వీప్ఎక్స్ కంపెనీలు లాభాలు పెంచుకుంటున్నాయి. కానీ ప్రొడ్యూసర్ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. ఇలాంటి సీన్ల కోసం బడ్జెట్ పెంచేస్తే సినిమా హిట్ అయితే ఓకే. బట్ సినిమా ఏదైనా తేడా కొడితే మాత్రం ప్రొడ్యూసర్ దారుణంగా నష్టపోతాడు.
Please Read Disclaimer