అందాల కీర్తికి ప్రేమలేఖ రాసిందెవరు?

0

సెలబ్రిటీని ప్రేమించే సామాన్యుడి ప్రేమకథలు సినిమాలుగా వచ్చాయి. అయితే అదే తరహా సన్నివేశం అందాల కథానాయిక .. జాతీయ అవార్డ్ గ్రహీత కీర్తి సురేష్ కి ఎదురైంది. కీర్తిని ఓ యువకుడు సీరియస్ గానే ప్రేమించాడట. తనని ప్రేమిస్తున్న విషయాన్ని ఆ యువకుడు కీర్తికి చెప్పేశాడు. అది కూడా ప్రేమలేఖ రూపంలో. ఇటీవలే ఓ షాపు ఓపెనింగు వేళ ఈ సంగతి బయటపడింది. ఆ కుర్రాడి లవ్ గురించి కీర్తి తనే స్వయంగా వెల్లడించింది. ఒక షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు అభిమాని ఇచ్చిన పార్శల్ తెరిచి చూస్తే నా ఫొటోలతో కూడిన ఒక అందమైన ఆల్బమ్ ఉంది. అందులో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటూ ఒక లేఖ కూడా దొరికిందని కీర్తి వెల్లడించింది.

నా కాలేజ్ లైఫ్ లో ఎవరూ ప్రేమలేఖలు ఇవ్వలేదు. ఆ యువకుడు రాసిందే తొలి ప్రేమలేఖ. ఆ లేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్నానని కీర్తి చెబుతోంది. తాను మాత్రం ఎవరి ప్రేమలోనూ పడలేదని వెల్లడించింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాను చెబుతున్నది మాత్రం నిజం అని కుండబద్దలు కొట్టేసింది. అంతా బాగానే ఉంది కానీ.. ప్రేమిస్తున్నా అని బయటపడింది ఒకే ఒక్క యువకుడు అయినా మనసులో మౌన రాగం ఎందరో యువకుల్లో అలానే మిగిలిపోయింది.

అన్నట్టు కీర్తి పెళ్లెప్పుడు చేసుకుంటుంది? అంటే దానికి సరైన ఆన్సర్ లేదు. మహానటి తర్వాత వేరొక బయోపిక్ లో నటించే ఆసక్తి లేదని కీర్తి వెల్లడించింది. సావిత్రిగా నటించాక ఇక ఎవరి జీవితకథలోనూ నటించలేనని కీర్తి ఎమోషన్ అయ్యింది. ఇకపోతే కీర్తి తదుపరి బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాకి కమిటైంది.
Please Read Disclaimer