వెంకీ ’75’ ఎవరితో ?

0

కొందరు హీరోలకు సంబంధించి ఓ ల్యాండ్ మార్క్ మూవీ అంటే ఆ హీరో ఫ్యాన్స్ తో పాటు అందరి ఫోకస్ సినిమాపైనే ఉంటుంది. అలాంటి ఫోకస్ ఏ ఇప్పుడు వెంకటేష్ 75వ సినిమా మీద నెలకొంటుంది. ఇంకా 74 వ సినిమా సెట్స్ పైకి రాలేదు… కానీ ఇప్పటి నుండే ఫ్యాన్స్ లో వెంకీ 75 వ సినిమా మీద చర్చ నడుస్తుంది.

నిజానికి ల్యాండ్ మార్క్ సినిమాను త్రివిక్రమ్ తో చేయాలనుకున్నాడు వెంకీ. కానీ ఎందుకో ఈ కాంబో కుదరట్లేదు. అయితే అనుకోకుండా తరుణ్ భాస్కర్ ఓ రేస్ బ్యాక్ డ్రాప్ లో కథను సిద్దం చేస్తూ వెంకీ నెక్స్ట్ లిస్టులోకి వచ్చి చేరాడు. అసురన్ రీమేక్ తర్వాత తరుణ్ భాస్కర్ తోనే వెంకీ 75 వ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది.

కానీ తరుణ్ కంటే ముందే వెంకీ ఫోకస్ అనిల్ రావిపూడి మీద ఉంది. అవును సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అవ్వగానే అనిల్ వెంకీ కోసం ‘f3’కథ రెడీ చేస్తాడనే టాక్ ఉంది. వెంకీ కూడా ఈ సీక్వెల్ పైనే ఆసక్తి చూపిస్తున్నాడంటున్నారు. ఏదేమైనా వెంకటేష్ అండ్ సురేష్ బాబు ఇద్దరూ 75వ సినిమా గురించి డైలమాలోనే ఉన్నారు.
Please Read Disclaimer