అఖిల్ 4 ఎందుకు స్లో అవుతోంది ?

0

ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన తరుణంలో అసలు ఫామ్ లో లేని దర్శకుడిని ఎంచుకుని షాక్ ఇచ్చిన అఖిల్ నాలుగో సినిమా షూటింగ్ ఆశించినంత వేగంగా సాగడం లేదని ఇన్ సైడ్ టాక్. దీన్ని నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్ 2 సంస్థ ఇప్పటిదాకా ఏ సినిమాను డిలే చేసుకుంటూ తీయలేదు. అందులోనూ ఇలాంటి మీడియం బడ్జెట్ మూవీస్ కి పక్కా ప్లాన్ వేసుకుంటే అనుకున్న టైంకి జరిగిపోవాల్సిందే. కానీ అఖిల్ 4 విషయంలో మాత్రం ఆలా జరగడం లేదని వినికిడి. స్లోగా షూట్ సాగుతుండటం పట్ల గీత కాంపౌండ్ లో కొంత అసంతృప్తి నెలకొందనే మాట వినిపిస్తోంది.

ఇది నిజమో కాదో పక్కన పెడితే దీని కన్నా లేట్ గా మొదలై ఇదే సంస్థ తీస్తున్న సాయి తేజ్ ప్రతి రోజు పండగే చాలా ఫాస్ట్ గా పూర్తవుతోందట. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మారుతీ దర్శకుడు. కెరీర్ పరంగా భాస్కర్ సీనియర్ అయితే కౌంట్ పరంగా మారుతీ ముందున్నాడు. కానీ భాస్కర్ ఎందుకు మెల్లగా చేస్తున్నాడు అనే దాని మీద కారణాలు ప్రస్తుతానికి తెలియవు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇంకా హీరోయిన్ ఫైనల్ కాకపోవడం అసలు రీజన్ గా చెబుతున్నారు. ఇప్పటికీ ఇందులో అఖిల్ జోడి ఎవరో అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. రెండు మూడు ఛాయస్ లు పెట్టుకున్నారు కానీ ఏది సెట్ కాక కాలయాపన జరుగుతోంది.

ఈలోగా అఖిల్ సోలోగా ఇతర ఆర్టిస్టుల కాంబినేషన్లో ఉన్న సీన్లు పూర్తి చేస్తున్నాడు భాస్కర్. ఈ లెక్కన అఖిల్ నాలుగో సినిమా ఈ ఏడాది విడుదల కావడం గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి. మరోవైపు డిసెంబర్ కు ప్లాన్ చేసుకున్న ప్రతిరోజు పండగే నెల ముందుగా నవంబర్ కు ప్రీ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని మరో సమాచారం.ఏదో గ్రహాల లోపం ఉన్నట్టు అఖిల్ ప్రతి సినిమాకు ఇలా ఏదో ఒక అడ్డంకి రావడం అభిమానులను కలవరపెట్టేదే.
Please Read Disclaimer