అక్కినేని కోడలు బ్రేక్ .. కారణమేంటి?

0

అక్కినేని కోడలు సమంత వరుసగా సినిమాల్లో నటిస్తూ సక్సెస్ బాటలో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. 2019లో ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ విజయాల్ని ఖాతాలో వేసుకున్నారు. మజిలీ- ఓ బేబి చిత్రాలతో చెప్పుకోదగ్గ విజయాలే దక్కాయి. హ్యాపీయెస్ట్ మూవ్ మెంట్ ఇది. గత ఏడాది సూపర్ డీలక్స్- యూటర్న్ చిత్రాల్లో నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సూపర్ డీలక్స్ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమంతపై ఏడాది కాలంగా రకరకాల రూమర్లు షికారు చేస్తున్నాయి.

అప్పట్లోనే సమంత ఫ్రెగ్నెంట్ అని… బ్రేక్ తీసుకోబోతున్నారని ప్రచారం సాగింది. అయితే ఇదివరకూ పలుమార్లు ఈ తరహా రిపీటెడ్ రూమర్లు వస్తే సమంత వాటిని ఖండించారు. అలాంటి శుభవార్త ఏదైనా ఉంటే స్వయంగా మీడియాకి వెల్లడిస్తామని అన్నారు. అయితే సామ్ పై మరోసారి ఈ తరహా రూమర్లు మొదలయ్యాయి.

నాగచైతన్య- సమంత జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. అందుకే సమంత కెరీర్ కి చిన్నపాటి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారని ప్రచారమవుతోంది. బ్రేక్ కావాలని నిర్మాతలకు డైరెక్టుగానే చెప్పేస్తున్నారట. కాల్షీట్లు కావాలని సంప్రదించే నిర్మాతలకు ఈ సంగతిని చెబుతున్నారట. అలాగే నాగచైతన్యతో కలిసి సపరేట్ గా కాపురం పెట్టాలనుకుంటున్నారని మరో ప్రచారం వేడెక్కిస్తోంది. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనా? అని ఆరాతీస్తే.. సామ్ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. కేవలం ఆ వెబ్ సిరీస్ కోసమే ఇలా నిర్మాతలకు కండిషన్లు పెడుతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. రూమర్ కాదు నిజమేనా? అన్నదానికి అట్నుంచి స్పష్టత రావాల్సి ఉంటుంది. ఒకవేళ అదే నిజమైతే ఆ శుభవార్తను అభిమానులతో షేర్ చేసుకునేందుకు అక్కినేని ఫ్యామిలీకి దాపరికం ఏం ఉంటుంది?.. అధికారిక వార్త కోసం ఆగి చూడాల్సిందే.
Please Read Disclaimer