రవి.. లాస్య బిగ్ బాస్ కి వెళ్లాల్సింది కాని ఏమైంది?

0

బుల్లి తెర ప్రేక్షకులకు రవి.. లాస్యల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. వారిద్దరు పలు రియాల్టీ షోలతో పాటు స్టేజ్ షోలపై కూడా అలరించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరి జోడీకి బ్రేక్ పడింది. లాస్య పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో అడుగు పెట్టింది. ఇక రవి యధావిధిగా తన ప్రొఫెషనల్ లైఫ్ ను కొనసాగిస్తున్నాడు. శ్రీముఖితో కలిసి పటాస్ తో పాటు పలు షో లు చేస్తున్నాడు. ఏవో కారణాల వల్ల బ్రేక్ అయిన రవి లాస్య జంటను మళ్లీ కలపాలని బిగ్ బాస్ టీం ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది.

బిగ్ బాస్ నిర్వాహకులు కొన్ని నెలల క్రితం యాంకర్ రవిని సంప్రదించారని అందుకు ఆయన కూడా ఆసక్తిని చూపించాడట. అయితే యాంకర్ రవి ఒక్కడే కాకుండా ఆయనకు మంచి పెయిర్ అనిపించుకున్న లాస్యను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకు రావాలనుకున్నారు. వీరిద్దరు ఉంటే షో మరింత రక్తి కట్టే అవకాశం ఉందని భావించారు. విషయాన్ని లాస్యకు బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేయడంతో పాటు తన నెలల పాపాయిని చూసుకోవాలంటూ సారీ చెప్పేసింది.

రవి షో లో ఉంటాడనే కారణంతోనే లాస్య ఈ షోకు నో చెప్పి ఉంటుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. యాంకర్ రవితో లాస్యకు స్టేజ్ షేర్ చేసుకోవాలని లేదని.. స్క్రీన్ పై కూడా అతడితో కలిసి కనిపించాలని లాస్యకు లేదని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. మొత్తానికి లాస్య నో చెప్పడంతో యాంకర్ రవికి కూడా బిగ్ బాస్ టీం నో చెప్పింది. ఇప్పటికే శ్రీముఖి ఉండగా లాస్య మరియు రవిలు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే రచ్చ రచ్చగా ఉండేదనేది నెటిజన్స్ అభిప్రాయం.
Please Read Disclaimer